Begin typing your search above and press return to search.

మన ‘‘ఆనందం’’ మరీ ఇంత తక్కువా?

By:  Tupaki Desk   |   17 March 2016 10:30 PM GMT
మన ‘‘ఆనందం’’ మరీ ఇంత తక్కువా?
X
భారత్ వెలిగిపోతుందని ఒకరంటారు. భవిష్యత్తు అంతా భారత్ దేనన్న భరోసా మాటలు వినిపిస్తుంటాయి. యూత్ ఫుల్ దేశం మనదే అని ప్రధాని మోడీ తరచూ చెబుతుంటారు. మరి.. యూత్ ఫుల్ దేశం ఎంత హ్యాపీగా ఉండాలి. అదేం ఖర్మో కానీ.. ఆనందం విషయంలో మన దేశం ర్యాంకు మరీ దరిద్రంగా ఉండటం ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఆనందంగా జీవించే దేశాలకు సంబంధించిన ఒక జాబితాను తయారు చేస్తే.. భారత్ అందులో 118 స్థానంలో ఉండటం ఆశ్చర్యానికి గురి చేసే అంశం.

మరింత షాకింగ్ అంశం ఏమిటంటే.. నిత్యం ఆనిశ్చిత పరిస్థితుల్లో బతుకుతారని భావించే మన దాయాది దేశమైన పాకిస్థాన్ లోనూ ప్రజలు ఎంతో హ్యపీగా ఉంటారని. అంతేకాదు.. మన పొరుగునే ఉండి.. ఆంక్షల కత్తి కొస కింద బతుకీడుస్తారని ఫీలయ్యే చైనాలోనే జనాలు చాలా సంతోషంగా ఉన్నట్లుగా వారికి లభించిన ర్యాంకింగ్ స్పష్టం చేస్తున్నాయి.

ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఒకటి వివిధ దేశాల్లోని ప్రజలు ఆనందంగా ఉండే స్థాయిల్ని అనుసరించి ర్యాంకింగ్ లు ఇచ్చారు. మొత్తం 156 దేశాలకు ర్యాంకింగ్ ఇస్తే.. భారత్ 118వ స్థానంలో నిలిస్తే.. పాకిస్థాన్ 92 స్థానంలో మనకంటే మెరుగ్గా ఉంటే.. చైనా అయితే ఏకంగా 83వ స్థానంలో ఉండటం గమనార్హం. మరి.. మన దేశంలో ఎందుకింత బాధలో ఉంటాయన్న విషయాన్ని చూస్తే.. సంపద పంపిణీ.. అసమానతలు.. సామాజిక పరిస్థతులపైనా.. ప్రభుత్వ విధానాలపైనా.. జాతీయ గణాంకాలు.. ప్రజారోగ్యం.. సైకాలజిస్ట్ ల విశ్లేషణలతో ఈ గణాంకాల్ని తయారుచేస్తారని చెబుతున్నారు. చైనా.. పాక్ లో కంటే మన దగ్గర పరిస్థితులు మరీ అంత ఇబ్బందికరంగా ఉన్నాయా? అన్నది ఒక ప్రశ్న.

ఇక.. ప్రపంచంలోనే అత్యంత ఆనందంగా బతికే దేశ పౌరుల్ని చూస్తే.. తొలి స్థానం డెన్మార్క్ కు లభించింది. గత ఏడాది మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ కు దక్కగా.. ఈసారి రెండో స్థానానికి పడిపోయింది. మూడో స్థానంలో ఐస్ లాండ్.. నాలుగో స్థానంలో నార్వే.. ఐదో స్థానంలో ఫిన్లాండ్ లు ఉన్నాయి. ఇక.. ప్రపంచ పెద్దన్న అమెరికా 13 స్థానంలో నిలిస్తే.. ఆస్ట్రేలియాకు 9 స్థానం లభించింది. ఇక.. ఇజ్రాయిల్ 11వ స్థానంలో నిలవటం గమనార్హం.

ఇక ప్రపంచంలో ఆనంతం అన్నది చాలా.. చాలా తక్కువగా ఉండే దేశాల్ని చూస్తే..అఫ్గనిస్తాన్.. బోగో.. సిరియా.. బురండి.. ర్వాండా.. బెనిన్ దేశాలు నిలిచాయి. పాపం ఆ దేశాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో..?