Begin typing your search above and press return to search.
క్రికెట్ దేవుడ్ని అంత మాట అంటావా?
By: Tupaki Desk | 14 Nov 2017 4:16 AM GMTగతంలో మనసులోని వికారాలు బయటకు వచ్చేవి కావు. ఒకవేళ వచ్చినా వాటికి గుర్తింపు ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎవరు ఏం మాట్లాడాలన్నా.. ఏం చెప్పాలన్నా వారికో వేదిక ఏడ్చి చచ్చింది. సోషల్ మీడియా పుణ్యమా అని వికారాలు వివాదాలుగా మారటం మామూలైపోయింది.
కౌన్ కిస్కా గొట్టాం సైతం.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం.. దానికి కౌంటర్ వేసే క్రమంలో అది వైరల్ అయిపోయి.. అదో ఇష్యూలా మారిపోయే పరిస్థితి. తాజాగా అలాంటిదో ఒక ఉదంతం చోటు చేసుకుంది. క్రికెట్ దేవుడిగా అభిమానించి.. ఆరాధించే సచిన్ టెండూల్కర్ మీద ఆస్ట్రేలియా విలేకరి డెన్నిస్ ఫ్రీడ్ మన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ ఆసీస్ విలేకరి మన రాంగోపాల్ వర్మకు అడ్వాన్స్ వెర్షన్. వర్మ మాట్లాడే ప్రతిది వివాదాస్పదం అవుతుంది. కాకుంటే వర్మ చేసే వ్యాఖ్యల వెనుక ఏదో ఒక మర్మం ఉంటుంది. ఫ్రీడ్ మన్ తో పోలిస్తే వర్మ చాలా బెటర్ అని చెప్పాలి.
వివాదాల కోసం.. ఆ పేరిట వచ్చే గుర్తింపు కోసమేనన్నట్లుగా ఫ్రీడ్ మన్ మాట్లాడినట్లుగా ఉంటుంది. ప్రతిఒక్కరి మీద జోకులేసి..వారిని కించపరిచే మనస్తత్వం ఎక్కువ. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అదే పనిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు. అసందర్భంగా జోకులేస్తూ. తనకెంత అహంభావం ఉందన్న విషయాన్ని తన ట్వీట్ల రూపంలో తెలిసేలా చేస్తాడు.
తాజాగా టెన్నిస్ దిగ్గజం.. అందాల భామ మరియా షరపోవా ఒక చైనా వ్యక్తిని కలిసి ఫోటో దిగింది. సదరు చైనా వ్యక్తి పొట్టిగా ఉండటం ఫ్రీడ్ మన్ కంట్లో పడింది. అంతే.. అతగాడి పైత్యం ప్రకోపించింది. సదరు ఫోటోను పోస్ట్ చేసి సచిన్ టెండూల్కర్ కలవటం చాలా ఆనందంగా ఉందంటూ జోకేశాడు.ఆ విషయాన్ని షరపోవా చెప్పినట్లుగా వెల్లడించాడు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే.. షరపోవాను కలిసిన వ్యక్తి పొట్టిగా ఉండటంతో హైట్‌ను దృష్టిలో పెట్టుకొని ఎటకారం చేశాడన్న మాట.
దీనికి సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఎత్తు సమస్య కాదు.. నువ్వు సాధించిన విజయాలే నీ గొప్పతనాన్ని తెలియజేస్తాయి.. హద్దులు దాటకు అని ఒక నెటిజన్ రియాక్ట్ అయితే.. క్రికెట్ దేవుడు.. దిగ్గజ క్రికెటర్ సచిన్‌కు గౌరవం ఇవ్వటం నేర్చుకో.. అతనిపై జోకులేసే హక్కు నీకు లేదంటూ చావుతిట్లు తిట్టారు. సచిన్ కు ఉన్న పేరులో షరపోవా ఒక్కశాతం సాధించలేదు.. గుర్తింపు కోసమే నువ్వు ఇలా చేస్తున్నావు.. సిగ్గుచేటు అంటూ ఫైర్ అయ్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సచిన్ మీద జోకులేసిన ఫ్రీడ్ మాన్ అవగాహనరాహిత్యం ఏ స్థాయిలో అంటే.. షరపోవాతో ఫోటో దిగిన వ్యక్తి ఎవరోకాదు.. చైనా ఆన్ లైన్ దిగ్గజ వ్యాపారి అలీబాబా చీఫ్ జాక్ మా. ఈ విషయాన్ని గుర్తించిన పలువురు ముందు నువ్వు వ్యక్తుల్ని గుర్తించటం నేర్చుకో.. తర్వాత ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేద్దవంటూ గడ్డి పెట్టారు. ఎటకారం కోసం పోస్టులు పెట్టే ఇలాంటోళ్లకు ఎవరెన్ని మాటలు అన్నా.. మనసుకు ఎక్కించుకుంటారా?