Begin typing your search above and press return to search.

ఆ విద్యా సంస్థలోకి నేతలకు నో ఎంట్రీ

By:  Tupaki Desk   |   16 Jan 2017 4:41 AM GMT
ఆ విద్యా సంస్థలోకి నేతలకు నో ఎంట్రీ
X
విద్యాసంస్థల్లో రాజకీయాలు అస్సలు నడవకూడదు.కానీ.. విద్యాసంస్థల్ని రాజకీయాలకు కేంద్రాలుగా మార్చేస్తున్న రాజకీయపార్టీలు ఎన్నో. ఇలాంటి వేళ.. రాజకీయ పార్టీలు కానీ.. రాజకీయ నేతలు కానీ తమ విద్యాసంస్థలోకి అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసిందో విద్యాసంస్థ. అంతేకాదు.. తమ విద్యాసంస్థలో చదువుకునే విద్యార్థులు.. పని చేసే ఉపాధ్యాయులు ఎవరూ రాజకీయ చర్చల్లో పాల్గొనకూడదని తేల్చేసింది.అయితే.. ఇదంతా ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయ్యే వరకేనని వెల్లడించింది.

ఇంతకీ ఆ ఆసక్తికర నిర్ణయాన్ని ప్రకటించిన విద్యాసంస్థ ఏదంటే.. యూపీలోని దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ అనే ఇస్లామిక్ సంస్థ. పెద్ద ఎత్తున విద్యా సంస్థల్ని నిర్వహించే ఈ సంస్థకు చెందిన ప్రధాన నిర్వాహకుడు మౌలానా ముఫ్తీ అబ్దుల్ ఖాసిం నౌమానీ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. యూపీతో సహా మొత్తం ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు.

ఎన్నికలు ముగిసే వరకూ తమ విద్యాసంస్థల్లోకి ఏ రాజకీయ పార్టీని కానీ.. రాజకీయ నాయకుడ్ని కానీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో రాజకీయ లబ్థి కోసం మా విద్యాసంస్థల్ని వినియోగించుకోవటానికి ఏ రాజకీయ పార్టీకి.. రాజకీయ నాయకుడికి అవకాశం ఇచ్చేది లేదని ఆయన వెల్లడించారు. ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ ఏ రాజకీయ నాయకుడ్ని కలిసేందుకు తమకు సమయం లేదన్న ఆయన.. ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ ఈ నిబంధన ఉంటుదని చెప్పారు. తమ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం ఎలాంటి రాజకీయ చర్చల్లో పాల్గొనరని తేల్చి చెప్పారు. ఇలాంటి నిర్ణయాన్ని ప్రముఖ విద్యాసంస్థలు అనుసరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/