Begin typing your search above and press return to search.
ఆనందయ్య కరోనా మందుపై తేల్చేసిన ఆయుష్ శాఖ
By: Tupaki Desk | 23 May 2021 4:35 AM GMTనెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా విరుగుడు పేరుతో ఆనందయ్య ఇస్తున్న మందును నాటుమందుగా గుర్తించినట్టు ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. అది ఆయుర్వేద మందు కాదని.. దానికి సంబంధించిన ప్రొటోకాల్స్ ఏవీ ఇందులో పాటించట్లేదని తేల్చారు.
అయితే ఆనందయ్య ఆయుర్వేద మందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని.. ఇది హానికరం కాదని స్పష్టం చేశారు. కంటిలో వేసే డ్రాప్స్ లోనూ సాధారణ పదార్థాలే ఉపయోగిస్తున్నారని వెల్లడించారు.
శనివారం ఆయుష్ ప్రతినిధుల అధికారుల బృందం ఆనందయ్య మందు తయారీని ప్రత్యక్షంగా పరిశీలించి పరిశోధించారు. అనంతరం ల్యాబ్ లో దాని నమూనాలను పరిశీలించారు. ఆ ఫలితాలు .. మందు తీసుకున్న వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
చివరకు ఆనందయ్య మందును నాటు మందుగా పరిగణిస్తున్నట్టు ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. వంశపారంపర్యంగా ఆనందయ్య మందులు ఇస్తున్నారని.. కరోనా పేరుతో ఇస్తున్న మందు కూడా నాటు మందేనని తేల్చారు. ఈ మందు వినియోగంలో ఎవరికి వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
అయితే ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక సైన్స్ కు నివేదిక పంపారు. ఆ రిపోర్టు వచ్చాక ఆనందయ్య మందుపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ మందు తయారీకి సంబంధించి ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని ఆయుష్ అధికారుల పరిశీలనలో తేలింది.
మిక్సీలో వేసి ఔషధ మూలికలతో ఆనందయ్య ఈ పదార్థాలు తయారు చేస్తున్నారు. ముళ్ల వంకాయలు, తోక మిరియాలు, తేనేలతో మిశ్రమాన్ని తయారు చేస్తున్నట్టు ఆయూష్ అధికారులు తెలిపారు. ఇందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవన్నారు.
ఆనందయ్య మందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇస్తే టీటీడీ ఆయుర్వేద విభాగంలో ఆనందయ్య మందు తయారు చేసి అందరికీ పంచుతామని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు.