Begin typing your search above and press return to search.

పెద్ద నోట్ల షాకు...ఇప్పుడు త‌గులుతోంది జాగ్ర‌త్త‌

By:  Tupaki Desk   |   3 Feb 2018 11:38 AM GMT
పెద్ద నోట్ల షాకు...ఇప్పుడు త‌గులుతోంది జాగ్ర‌త్త‌
X
2016 నవంబర్ 8. ప్రతి భార‌తీయుడికి గుర్తుండే తేదీ. పాత 500 - 1000 రూపాయల నోట్లను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్రభుత్వం ఆరోజున రద్దు చేసింది. దీంతో ఒక్క‌సారిగా క‌ల్లోలం. న‌ల్ల‌ధ‌నంపై ఉక్కుపాదం ఎపిసోడ్‌ లో తాజాగా కొత్త వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో లెక్కకురాని పాత నోట్లు రూ. 15 లక్షలు అంత కంటే ఎక్కువ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన దాదాపు 2 లక్షల మందికి ఆదాయపు పన్ను విభాగం నోటీసులు పంపించింది.

సెంట్ర‌ల్‌ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఈ విష‌యాన్ని తాజాగా వెల్ల‌డించింది. "పర్సనల్ అకౌంట్లలో రూ. 15 లక్షలు అంత కంటే ఎక్కువ డిపాజిట్ చేసి ఆ డబ్బు మీద ఎటువంటి రిటర్నులను దాఖలు చేయని అకౌంట్లు దాదాపు 1.98 లక్షలు గుర్తించాం. ఆ అకౌంట్లకు సంబంధించిన అకౌంట్ హోల్డర్స్ అందరికీ గత సంవత్సరం డిసెంబర్ - ఈ సంవత్సరం జనవరి నెలలో నోటీసులు పంపించాం. అయితే.. ఇప్పటి వరకు వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. రిప్ల‌యి ఇవ్వని అకౌంట్ హోల్డర్లకు ఖచ్చితంగా పెనాల్టీ విధించడం జరుగుతుంది.." అని సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర మీడియాకు తెలిపారు.

అంతే కాదు.. గడిచిన మూడు నెలల్లో వివిధ ప్రాంతాల్లో పన్ను ఎగవేత - పన్ను కట్టడంలో ఆలస్యం - అబెట్‌ మెంట్ లాంటి కేసులే దాదాపు 3000 వరకు ఉన్నాయని సుశీల్ చంద్రం తెలిపారు. డిజిటలైజేషన్‌ ను ప్రోత్సహించడం కోసమే ఈ అసెస్‌ మెంట్ అనే ఆన్‌ లైన్ విధానాన్ని తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. టెస్టింగ్ కోసం ఈ సంవత్సరం ఈ అసెస్‌మెంట్ విధానాన్ని తీసుకొచ్చాం. గడిచిన మూడు నెలల్లో సుమారు 60 వేల వరకు ఈ అసెస్‌ మెంట్లు జరిగాయి. అయితే.. వచ్చే రోజుల్లో ఈ అసెస్‌మెంట్ విధానం ద్వారా టాక్స్ ఫైలింగ్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.