Begin typing your search above and press return to search.
డిప్యూటీ సీఎం ఝలక్.. జనసేనలోకి సోదరుడు
By: Tupaki Desk | 4 Feb 2019 5:37 AM GMTఏపీ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశంలో పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా చినరాజప్పకు పేరుంది. ప్రభుత్వంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఈ వీర విధేయత చూసే చిన్నరాజప్పకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు.
రాబోయే ఎన్నికలకు టీడీపీ, చిన్నరాజప్ప విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపు కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో చిన్నరాజప్పకు ఆయన సోదరుడు కోలుకోలేని జలక్ ఇచ్చాడు. చిన్న రాజప్ప సోదరుడు లక్ష్మణ్ మూర్తి (బాబ్జీ) తాజాగా జనసేన పార్టీలో చేరుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న లక్ష్మణ్ మూర్తి జనసేనలో చేరి ఆ పార్టీ సభ్యత్వం తీసుకోబోతున్నారు.
శనివారం ఉప్పలగుప్తం మండలం పెదగాడవల్లిలో నిర్వహించే ప్రచార కార్యక్రమంలో లక్ష్మణ్ మూర్తి జనసేన పార్టీలో చేరబోతున్నారు. అంతేకాదు.. ఆయన కాపు సామాజికవర్గమంతా పవన్ కళ్యాణ్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చాడు. ఇలా సోదరుడు జలక్ ఇవ్వడంపై చిన్నరాజప్ప ఇప్పటివరకూ స్పందించలేదు.
లక్ష్మణ్ మూర్తి చేరికతో ఆ ప్రాంతంలో జనసేన బలోపేతం కానుంది. ఇక చిన్నరాజప్ప సోదరుడు జనసేనలో చేరికపై టీడీపీ ముఖ్యనాయకులు ఎటువంటి కామెంట్ చేయడం లేదు. ప్రస్తుతం పెద్దాపురం నుంచి గెలిచిన చిన్నరాజప్ప జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపుతున్నారు. ఇప్పుడు ఆయనకు పోటీగా తమ్ముడు బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది.