Begin typing your search above and press return to search.
బీజేపీ డిప్యూటీ సీఎంపై జోకులు..ఎందుకంటే ?
By: Tupaki Desk | 6 May 2018 5:08 AM GMTఇటీవలి కాలంలో దళితుల్లో పెద్ద ఎత్తున బీజేపీ పట్ల వ్యతిరేకత రావడం - మరోవైపు ఎస్సీ - ఎస్టీ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆ వర్గంలో ఆగ్రహం ఉన్న నేపథ్యంలో దళితుల ఇళ్లల్లో భోజనాల కార్యక్రమాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించిన విషయం విదితమే. దీంతో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం దళితులకు చేరువ కావాలని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు చెందిన పార్టీ నాయకులను ఆదేశించారు. దీని ప్రకారం నేతలు ఫాలో అవుతున్నప్పటికీ...అది ఆచరణలో నవ్వుల పాలు అవడమే కాకుండా..వివాదాస్పదం కూడా అవుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కాన్పూర్ లోని ఛాజా గ్రామంలో దళితుల ఇండ్లలో బసచేసిన తీరు ఇందుకు నిదర్శనం. ఆయనతో పాటు బసకు అవసరమైన వన్నీ తెచ్చుకోవడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
దళితుల ఇంట్లో బస కార్యక్రమంలో భాగంగా యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య అధికారులు - ఉపముఖ్యమంత్రితో కలిసి ఓ దళిత మహిళ ఇంటికి భోజనానికి వెళ్లారు. దళిత మహిళ ఛున్నీదేవి సాదరంగా ఆహ్వానించింది. అతిథి కోసం వండివార్చిన ఆహారాన్ని పెట్టడానికి సిద్ధమైంది. కానీ వాటిని ఉపముఖ్యమంత్రి అస్సలు ముట్టకోలేదు. రాత్రి బసతో మంచి ఫుడ్ - బెడ్ ఏర్పాట్లను అధికారులంతా అఘమేఘాలపై చేసేశారు. డిప్యూటీ సీఎంతో పాటు అధికారులు - మందిమార్బలానికి అవసరమైన పప్పు - రొట్టెలు - సలాడ్ - రైతా - మిక్స్ డ్ కూరగాయులు అధికారులే రెడీ చేసేశారు. అంతేకాకుండా కేశవ్ ప్రసాద్ నిద్రపోవటానికి కొత్త మంచాలను తెప్పించారు. ఆయన తలగడ పక్కనే బిస్లరీ బాటిల్స్ కూడా అందుబాటులో ఉంచారు. దీంతో దీనిపై పలువురు నెటిజన్లు నవ్వుకుంటున్నారు. దళిత ఓట్లకోసమే బీజేపీ నేతల పాట్లు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
మరోవైపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అమిత్ షా కూడా దళితుల ఇళ్లల్లో వండివార్చిన ఆహారాన్ని తినకుండా బడా హోటల్స్‌నుంచి తెప్పించుకున్న సంగతి తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా...బీజేపీ నాయకులు చేపట్టిన దళితుల ఇళ్లళ్లో భోజనం కార్యక్రమం పట్ల ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. ఆ పార్టీ నాయకులకు చురకలంటించారు. డ్రామాలు కట్టిపెట్టాలని.. అప్పుడప్పుడు కాకుండా తరుచూ దళితులతో సమావేశమవ్వాలని బీజేపీ నాయకులకు సూచించారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ చేపట్టిన ఈ కార్యక్రమం కేవలం పబ్లిసిటీ స్టంటు లాంటిదని ఆరోపించారు. ఇలా కాకుండా దళితుల ఇండ్లకు మీ కుటుంబ సభ్యులను (బీజేపీ నాయకులనుద్దేశించి) పంపండి.. వారిని మీ ఇళ్లకు ఆహ్వనించండి అని కోరారు. చిత్రంగా ఆ మరుసటి రోజే బీజేపీ నేత చిత్రాలు వైరల్ అయ్యాయి.