Begin typing your search above and press return to search.
మరోసారి హాట్ టాపిక్ గా మారిన మహమూద్ అలీ
By: Tupaki Desk | 12 April 2020 5:24 AM GMTగతానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తరచూ వార్తల్లోకి వస్తున్నారు. ఒక రాష్ట్ర హోం మంత్రికి ఉండే విలువ ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటిది ఇటీవల ప్రగతిభవన్ కు వచ్చిన మహమూద్ అలీని భద్రతా సిబ్బంది అడ్డుకోవటమే కాదు.. లోపలకు అనుమతించకపోవటం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తనకు అత్యవసరమైన ఫోన్ కాల్ రావటం.. వెంటనే ఆఫీసుకు వెళ్లాల్సి రావటంతో తాను వెళ్లిపోయినట్లుగా వివరణ ఇచ్చారు అలీ. అంతే తప్పించి.. తనను అడ్డుకోలేదన్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా నిర్వహించిన తెలంగాణ కేబినెట్ భేటీకి హాజరయ్యారు అలీ. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో మిగిలిన మంత్రుల మాదిరే హాజరయ్యారు మహమూద్ అలీ. మంత్రివర్గ సమావేశం ముగిసిన కాసేపటికి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు ప్రెస్ మీట్ కు హాజరు కాగా.. మహమూద్ అలీ మాత్రం వెళ్లిపోవటం గమనార్హం.
ప్రెస్ మీట్ ప్రారంభం ముందు వరకూ మంత్రి ఈటెల రాజేందర్ తో కలిసి ఉన్న మహమూద్ అలీ.. ముఖ్యమంత్రి రావటానికి కాస్త ముందుగా వెళ్లిపోవటం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకిలా? అన్నదిప్పుడు చర్చగా మారింది. అయితే.. అత్యవసర పని ఏదో ఉండటంతోనే ఆయన మీడియా సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోయారంటున్నారు. ఇలాంటి పరిస్థితే మరేదైనా ప్రభుత్వంలో చోటు చేసుకుంటే.. దాని మీద భారీగా ప్రశ్నలు ఉండేవి. కానీ.. కేసీఆర్ నోటికి భయపడి.. ఆ ప్రస్తావన తెచ్చేందుకు పాత్రికేయులు ఇష్టపడలేదని చెబుతున్నారు. ఇంతకీ మహమూద్ అలీ మాష్టారు ఎందుకు వెళ్లిపోయినట్లు? తాజా ఎపిసోడ్ పై ఈసారి ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.