Begin typing your search above and press return to search.

ముస్లింలపై డిప్యూటీ సీఎం కామెంట్స్ వైరల్

By:  Tupaki Desk   |   11 April 2020 2:00 PM GMT
ముస్లింలపై డిప్యూటీ సీఎం కామెంట్స్ వైరల్
X
వెంటనే పరీక్షలు చేయించుకుని మీ ప్రాణాలు - మీ కుటుంబ ప్రాణాలు... మన సమాజంలో ఇతరులను కాపాడాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ముస్లింలకు విజ్జప్తి చేశారు. ఈ మాట చెబుతూనే మరోవైపు కరోనా సోకి చికిత్స తీసుకుంటున్న కొందరు ముస్లింలు డాక్టర్ల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని... చెప్పినా వినకుండా పక్కనున్న పేషెంట్ల దగ్గరకు వెళ్లి పలకరిస్తున్నారన్నారు. వారు తిన్న ప్లేట్లు కడగకపోవడం - ప్లేట్లు నాకడం - వాటిలోనే మళ్లీ తినడం వంటి చిలిపిచేష్టలు చేస్తూ కరోనా ఇంకొందరికి సోకేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఇలాంటి వాళ్లందరూ ఢిల్లీ వెళ్లొచ్చి ఆంధ్రాలో ఉన్నారు. వారి వల్ల ఇంకా ఇతరులకు సోకుతోంది.

వాళ్లపై నాకేం కసి లేదు. వారికోసమైనా, వారి కుటుంబం కోసమైనా ఆసత్ప్రికి వచ్చి చూపించుకోవాలి. చికిత్స తీసుకోవాలి. మీరు అందరూ సహకరిస్తే ఇది త్వరగా తరిమేయొచ్చు అంటూ ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం కామెంట్లపై కొందరు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉన్నత హోదాలో ఉండి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎంత దాకా వెళ్తాయో చూడాలి.

ఇప్పటికే దేశంలో తబ్లిగి సదస్సుకు హాజరైన విదేశీయుల వల్ల దానికి హాజరైన మన దేశీయులకు వ్యాధి సోకింది. ఇది వారికి కూడా తెలియక కుటుంబ సభ్యులకు కూడా సోకింది. మార్చి 28 తర్వాత ఈ విషయం బయటపడటంతో అన్ని ప్రభుత్వాలు హుటాహుటిన అలర్ట్ అయ్యి... తబ్లిగి సదస్సుకు హాజరైన వారి వివరాలు సేకరించాయి. సోకిన వారిని చికిత్సకు - సోకని వారిని క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. దేశ వ్యాప్తంగా కొందరు చేస్తున్న కామెంట్లపై ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ స్పందించి... కరోనాకు మత ముద్ర వేయడం కరెక్టు కాదని - అది ఎవరికి అయినా సోకుతుందని... జాగ్రతగా ఉండాలని పిలుపునిచ్చారు. తాజాగా నారాయణ స్వామి అదేఅంశంపై వివాదాస్పద కామెంట్లు చేయడం గమనార్హం.