Begin typing your search above and press return to search.
చంద్రబాబు ఊళ్లో వారిని గుడిలోకి రానివ్వరు: డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 29 Sep 2020 5:32 PM GMTటీడీపీ చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా నిప్పులేకున్నా పొగ పుట్టించగలరని.. ఆ నేర్పరితనం వారికుందని వైసీపీ నేతలు తరచూ విమర్శిస్తుంటారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ పాల్గొన్న తిరుమల బ్రహ్మోత్సవాల్లో తనకు అవమానం జరిగిందంటూ వస్తున్న వార్తలను ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఖండించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేసి కడిగిపారేశారు.
దళితులంటే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చిన్నచూపని.. ఆయన పుట్టిన ఊరిలో ఇప్పటికీ దళితులను గుడిలో ప్రవేశంలో లేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా నారాయణ స్వామి ట్వీట్ చేస్తూ ‘తిరుమలలో నాకు అవమానం జరిగిందని యెల్లో మీడియా, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి ముసలి కన్నీరు కారుస్తున్నారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున దళితుడైన నేను పట్టు వస్త్రాలు సమర్పించాను. మీ హయాంలో దళితులతో భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం కల్పించారా? చంద్రబాబూ?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుకి దళితుంటే చిన్న చూపని.. ఇప్పుడు అతడి స్వార్థ రాజకీయాల కోసం దళితులని ఉద్దరించినట్లు ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనపై చంద్రబాబు బురద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి మీద, ప్రభబుత్వం మీద బురద జల్లుతున్నారని విమర్శించారు. అబద్ధాలతో లేఖ రాస్తున్నాడని ట్వీట్ లో విమర్శించారు.