Begin typing your search above and press return to search.

డేరాబాబా పై మరో సంచలన తీర్పు

By:  Tupaki Desk   |   12 Jan 2019 4:02 AM GMT
డేరాబాబా పై మరో సంచలన తీర్పు
X
డేరాబాబుకు మరో హత్య కేసు ఉచ్చు బిగుసుకుంది. ఇప్పటికే తన భక్తులైన ఆడవారి పై అత్యాచారాలు చేశాడని దోషిగా నిరూపితమై కోర్టు ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది. ఆ శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు మరో కేసు చుట్టుకుంది. ఓ జర్నలిస్టును చంపించిన కేసులోనూ డేరాబాదాను దోషిగా తేలుస్తూ తాజాగా పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో డేరాబాబాతో పాటు ముగ్గురిని కూడా హంతకులుగా కోర్టు తేల్చింది. అయితే శిక్షను మాత్రం ఈ నెల 17న కోర్టు తీర్పు రానుంది.

డేరాబాబా ఆశ్రమంలో మహిళల పై అత్యాచారాలు జరుగుతున్నాయని గ్రహించిన రామచంద్ర చత్రపతి అనే జర్నలిస్టు 2002లో వివరాలు సేకరించి పత్రికలో సంచలన కథనాలు వెలువరించారు. దీంతో రామచంద్రను డేరా బాబా కాల్చిచంపాడనే ఆరోపణలు వచ్చాయి. 2003లో దీని పై కేసు నమోదైంది. 2006లో సీబీఐకి కేసు బదిలీ అయ్యింది. ఇంతకాలం విచారణ తర్వాత కోర్టులో డేరాబాబాతో పాటు ఈ హత్యాకాండలో పాలుపంచుకున్న ముగ్గురిని హంతకులుగా కోర్టు తేల్చింది.

కాగా ఇప్పటికే రేపు కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డ డేరాబాబా అరెస్ట్ సమయంలో పంజాబ్, హర్యానాలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 40మంది వరకూ చనిపోయారు. దీంతో తాజా తీర్పు తర్వాత పోలీసులు హర్యానాలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. 17న వచ్చే తీర్పుతో డేరాబాబాబుకు ఏ శిక్ష పడనుందో తేలనుంది.