Begin typing your search above and press return to search.

డేరా బాబా పాపం పండింది. యావజ్జీవ శిక్ష పడింది

By:  Tupaki Desk   |   17 Jan 2019 4:13 PM GMT
డేరా బాబా పాపం పండింది. యావజ్జీవ శిక్ష పడింది
X
ఏడాది క్రితం డేరా బాబా అనే పేరు మీడియాలో మార్మోగిపోయింది. భక్తుల నమ్మకాల్ని అడ్డం పెట్టుకుని… ఒక సామ్రాజ్యాన్ని డేరా బాగా ఎలా సృష్టించాడో అందరికి తెలుసు. పోలీసులు చేతులో అరెస్ట్‌ అయిన దగ్గరనుంచి శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు యావజ్జీక కఠిన కారాగార శిక్ష విధిస్తూ.. పంచకుల న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది.

చేసిన పాపం ఎప్పటికైనా అనుభవించాల్సిందే. అది డేరా బాబా విషయంలో అక్షరాలా నిజమైంది. 2002లో సిర్సాకు చెందిన జర్నలిస్ట్ చత్రపతి తనపై పేపర్లో వార్తలు రాస్తున్నాడనే కోపంతో.. అతడ్ని అత్యంత దారుణంగా హత్య చేయించాడు. అప్పట్లో ఈ హత్య పెద్ద సంచలనంగా మారింది. అయితే తనకున్న పలుకుబడితో… ఇన్నాళ్లు మేనేజ్‌ చేస్తూ వచ్చాడు. కానీ ఎప్పటికైనా పాపం పండాల్సిందే కదా. అందుకే..బలమైన సాక్ష్యాలు లభించడంతో ఏడాది క్రితం అరెస్ట్‌ అయ్యాడు. ఇప్పుడు జర్నలిస్ట్‌ ని హత్య చేసిన కేసులో దోషిగా తేలడంతో.. డేరాబాబాతో సహా.. కుల్దీప్‌ సింగ్‌ - నిర్మల్‌ సింగ్‌ - కృషన్‌ లాల్‌ కు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు న్యాయమూర్తి. శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా కూడా విధించారు.