Begin typing your search above and press return to search.
కేసీఆర్ దగ్గరి మనుషులైతే లెక్కలు వేరే!
By: Tupaki Desk | 14 Dec 2016 6:47 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యవహారశైలికి మరో నిదర్శనం. తన అనుకుంటే కేసీఆర్ ఎలా వ్యవహరిస్తారో తెలిసిందే. ఉపాధ్యాయులను ఇతర పదవుల్లో నియమించవద్దని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఓఎస్ డీగా ఉన్న దేశపతి శ్రీనివాస్‌ను ఆయన పూర్వ ఉద్యోగ స్థానమైన ఉపాధ్యాయుడిగా బదిలీ చేశారు. అయితే ఆ వెంటనే దేశపతి తన టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు! తిరిగి దేశపతి శ్రీనివాస్ సీఎం కార్యాలయంలోకి అడుగుపెట్టేందుకే ఈ నిర్ణయం అనే వార్తలు వెలువడ్డాయి. వాటిని నిజం చేస్తూ.. సీఎం కార్యాలయంలో ఓఎస్డీ(సాంస్కృతిక వ్యవహారాలు)గా దేశపతి శ్రీనివాస్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలోనే దేశపతి మరోసారి సీఎం కార్యాలయంలో ఓఎస్డీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తద్వార తన వ్యవహారశైలిని మరోమారు కేసీఆర్ చాటి చెప్పారు.
ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తన కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్ డీ)గా దేశపతిని సీఎం కేసీఆర్ నియమించుకున్నారు. అయితే కోర్టు ఉత్తర్వులతో దేశపతిని సాగనంపారు. మళ్లీ తిరిగి రాజమార్గంలో క్యాంపు కార్యాలయంలోకి ఆహ్వానించారు. ఇదిలాఉండగా సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి దేశపతి ఆయన వెంట నడిచారు. కవి - గాయకుడు - రచయితగా ఆయన అనేక సభలు - సమావేశాలు - బహిరంగ సభల్లో పాల్గొని ప్రజలను ఉద్యమం వైపు మళ్లించేలా చైతన్యం తీసుకొచ్చారు. సాంస్కృతికంగా తెలంగాణ ఎంత ఉన్నతమైనదో తన వాగ్ధాటితో ప్రజలకు చెప్పేవారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తో సాన్నిహిత్యం పెరిగింది. దీంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన సేవలను ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని టీఆర్ ఎస్ వర్గాలు అంటున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/