Begin typing your search above and press return to search.
దేశపతి జాబ్ కు రిజైన్ చేశారంటే..
By: Tupaki Desk | 24 Nov 2016 9:52 AM GMTఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలన్న సూత్రం అప్పుడప్పుడు అభ్యంతరకర రీతిలో వినిపిస్తూ ఉంటుంది. కొన్ని అంశాల్లో ఈ మాట ఇలా ఉన్నా.. కొన్ని సందర్భాల్లో మాత్రం సరైనదే కదా? అన్న భావన కలిగేలా ఉంటుంది. నిబంధనల్ని పక్కాగా ఫాలో అయ్యే వారు.. అవ్వాబువ్వా కావాలని ఎంత మాత్రం కోరుకోరు. బయటకు ఎన్ని మంచి మాటలు చెప్పినా.. తమ వరకూ వచ్చేసరికి మర్చిపోతుంటారు.కొన్ని సందర్భాల్లో కావాలని.. మరోసారి అనుకోకుండా అలా జరిగిపోతుంది.
తెలంగాణ సీఎం కార్యాలయంలో ప్రత్యేక అధికారికంగా విధులు నిర్వహించిన ప్రముఖ కవి.. గాయకుడు దేశపతి శ్రీనివాస్ ఇష్యూ చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తన మాటలతో.. పాటలతో ఉర్రూతలూగించిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత.. ఉద్యమంలో ఆయన చేసిన సేవల్ని మర్చిపోకుండా తన పేషీలో ఆయన కీలక పదవిని ఇచ్చారు.
అయితే.. సిద్ధిపేట జిల్లా క్షీరసాగర్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహించాల్సిన ఆయన.. ముఖ్యమంత్రి పేషీలో పని చేయటంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయటం.. దీనిపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి.. ఉపాధ్యాయులు పీఏలుగా.. పీఎస్ లుగా బోధనేతర విధులు నిర్వహించకూడదని తీర్పు ఇచ్చింది.
దీంతో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేషీలో విధులు నిర్వహించాల్సిన ఆయన.. తాను చేస్తున్న పనిని వదిలేసి.. ఉపాధ్యాయుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన.. తన పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతను చేపట్టేందుకు వీలుగా.. ఆయన వీఆర్ ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పిల్లలకు విద్యా బోధనతో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన మాష్టారు.. వీఆర్ ఎస్ ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నను కాస్త అటూఇటూగా అడిగితే దేశపతి ఇచ్చిన సమాధానంతోనే.. ఆయన రానున్న రోజుల్లో ఏం చేయనున్నారో అర్థమవుతుంది. బంగారు తెలంగాణ రూపకల్పలో ముఖ్యపాత్ర పోషించేందుకు తనతో రావాలని కేసీఆర్ చేసిన సూచనతో తాను వీఆర్ఎస్ తీసుకున్నట్లుగా చెప్పటం గమనార్హం. సో.. మరికొద్ది రోజుల్లో దేశపతికి కీలక పదవిని అప్పజెబుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారన్న మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/