Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఉల్లంఘించిన కర్ణాటక ఎమ్మెల్యే ..ఏం చేసాడో చుడండి !

By:  Tupaki Desk   |   30 March 2020 10:50 AM GMT
లాక్ డౌన్ ఉల్లంఘించిన కర్ణాటక ఎమ్మెల్యే ..ఏం చేసాడో చుడండి !
X
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ భారిన పడి .. ఆ వైరస్ నుండి బయటపడటానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ కరోనా వ్యాప్తి వల్ల చాలామంది ప్రజలు చనిపోతున్నారు. అంతే కాకుండా రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ కారణంగా చాలా దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ కరోనాని అరికట్టడానికి మన దేశంలో కూడా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో దేశం మొత్తం జన జీవనం స్తంభించింది. ఈ లాక్ డౌన్ లో భాగంగా అత్యవసర సేవలు మినహాయించి మిగిలినవన్నీ రద్దు చేయబడ్డాయి. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఒక రాష్ట్రంలోని ప్రజలను ఇతర రాష్ట్రాలకు వెళ్లనియ్యడం లేదు.

ఇలాంటి కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నప్పటికీ కొంతమంది వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే , ఈ లాక్ డౌన్ నియమానాల్ని పాటించకుండా తుంగలో తొక్కింది ఒక సామాన్య వ్యక్తి కాదు. ఒక ప్రజాప్రతినిధి. భారతదేశంలో చాలామంది రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు కరోనా వైరస్ వ్యాపిస్తున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా బాధ్యతాయుతంగా నడుచుకుని ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఒక ఎమ్మెల్యే లాక్ డౌన్ ఉల్లంఘనకు పాల్పడ్డాడు. అలాగే ఆయనేం తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యే కాదు. 4 సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన ఎమ్మెల్యే కూడా ఇటువంటి సమయంలో ఎక్కువ బాధ్యతాయుతంగా నడుచుకుకోవలసిన ఈయన ఈ విధంగా చేయడం సరైనది కాదు. కర్ణాటకలోని గుబ్బి అనే ప్రాంతానికి చెందిన శాసనసభ సభ్యుడు ఎస్.ఆర్.శ్రీనివాస్.

ఇంతకీ ఈయన ఏం చేసారు అని అనుకుంటున్నారా ...లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్డు మొత్తం ఖాళీగా ఉండటంతో ..తన మనవడిని ఒక రిమోట్ కంట్రోల్డ్ బొమ్మ కారులో కూర్చోబెట్టి బయటకి తీసుకువచ్చాడు. ఈ సంఘటనను ఒక పోలీసు అధికారి మొబైల్ ఫోన్ కెమెరాలో వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. భారతదేశంలోని అనేక ఇతర ప్రాంతాల్లో లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు పోలీసు అధికారులు వాహనదారుల వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరికొందరికి భారీ జరిమానాలు కూడా విధించారు. కానీ , ఈ ఎమ్మెల్యే పై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ చర్యలు తీసుకోవడం అనేది ముఖ్యమైన అంశం కాదు ..ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ..నలుగురు లాక్ డౌన్ నియమాలని అనుసరించాలని చెప్పాల్సింది పోయి ..ఆయనే ఈ విదంగా చేయడం ఏ మాత్రం సమంజసం కాదు. ఎందుకంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వారు కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మిగిలిన వారిని ప్రోత్సహించడమే అవుతుంది.