Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రుల ప‌ర్య‌ట‌న వివ‌రాలు.. ఇంత దారుణ‌మా?

By:  Tupaki Desk   |   7 Feb 2022 11:30 AM GMT
ఏపీ మంత్రుల ప‌ర్య‌ట‌న వివ‌రాలు.. ఇంత దారుణ‌మా?
X
ఏ రాష్ట్రంలో అయినా.. మంత్రులు ఎక్క‌డైనా ప‌ర్య‌టిస్తున్నారంటే.. దానికి ఒక ప్ర‌త్యేకత ఉంటుంది. ఒక ప‌ర‌మార్థం కూడా ఉంటుంది. `ఊర‌క రారు మ‌హాను భావులు..` అన్న‌ట్టుగా.. మంత్రులు.. రాజ‌ధాని ప్రాంతాన్ని వీడి.. క్షేత్ర‌స్థాయిలో అడుగు పెట్టారంటే.. ఎంతో కీల‌క‌మైన కార్య‌క్ర‌మం ఉంటే త‌ప్ప‌.. వారు బ‌య‌ట‌కు రారు. అవి కూడా ప్ర‌జ‌ల‌కు ఉపయోగ‌ప‌డేలా.. దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాలు క‌ల్పించేలా.. ఉంటాయి. లేక‌పోతే.. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి.. అక్క‌డి స‌మ‌స్య‌లు తెలుసుకుని ప్ర‌భు్త్వానికి నివేదించే కార్య‌క్ర‌మాలు చేస్తారు.

లేక‌పోతే.. కీల‌క‌మైన ప్రాజెక్టులకు శంకుస్థాప‌న, లేదా.. ప్రారంభోత్స‌వాల‌కు మంత్రులు హాజ‌ర‌వుతారు. ఎక్కడైనా.. జ‌రిగేది ఇదే! పోనీ... ఏదైనా ఎన్నిక‌లు ఉంటే... ప్ర‌చారానికి వ‌స్తుంటారు. మ‌రి ఏపీలోనూ మం త్రులు ఉన్నారు. మ‌రి వారు కూడా క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. దీనికి సంబంధించి.. పెద్ద ఎత్తున ప్ర‌బుత్వం నుంచి రాను పోను ఖ‌ర్చులు, డీఏలు.. ఇలా ల‌క్ష‌ల రూపాయలు తీసుకుంటున్నారు. ఇటీవ‌ల ఒక మంత్రి శ్రీకాకుళంలో ప‌ర్య‌టించారు. దీనికి సంబంధించి ఆయ‌న ఇచ్చిన బిల్లు కూడా ఆర్థిక శాఖ వ‌ర్గాలు.. ఆశ్చ‌ర్య పోయాయి. ఇప్ప‌టికీ .. దానిని క్లియ‌ర్ చేయ‌లేదు.

అయితే.. ఇలా మంత్రులు ప‌ర్య‌ట‌న‌లు చేసిన‌ప్పుడు.. చేస్తున్న ప‌నులు ఏంటి? ఈ ప‌ర్య‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల‌కు ఒన‌గూరుతున్న ప్ర‌యోజ‌నం ఏంటి? అనే అంశాల‌ను ప‌రిశీలిస్తే.. ఒకింత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు వెలుగు చేస్తున్నారు. ఎక్క‌డైనా.. మంత్రులు ఏదైనా చేయొచ్చేమోకానీ.. జ‌గ‌న‌న్న పాల‌న‌లో మా స్ట‌యిలేవేరు! అంటున్నారు ఏపీ మంత్రులు. దీనికి కార‌ణం.. క్షేత్ర‌స్థాయిలో మంత్రులు చేస్తున్న ప‌ర్య‌ట‌న‌లు సిల్లీగా ఉండ‌డమే. వారు ఏ ప్రాజెక్టు శంకుస్థాప‌న‌కో.. లేక ఏ ప్ర‌భుత్వ కార్యాల‌యం రిబ్బ‌న్ క‌టింగుకో రావ‌డం లేదు.

కేవ‌లం.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏర్పాటు చేసిన‌.. జిమ్‌లు ప్రారంభించేందుకు, పెళ్లిళ్లు, గృహ‌ప్ర‌వేశాలు, నిశ్చితార్ధాలు, బిర్యానీ పాయింట్లు ఓపెనింగ్‌, రోడ్ సైడ్ నైట్ ఫుడ్ స్టాళ్ల‌ను ప్రారంభించేందుకు.. రెస్టారెంట్లు ప్రారంభించేందుకు రాజ‌ధానిని వ‌దిలి.. మంత్రులు వ‌స్తున్నారు. అయితే... ఇక్క‌డ కూడా రాను పోను ఖ‌ర్చుల‌ను ప్ర‌భుత్వంపైనే వేసేస్తున్నారు. వాస్త‌వానికి ఇలాంటి ప‌నులు ఎమ్మెల్యే స్థాయి అంత‌క‌న్నా .. చిన్న‌స్థాయిలో జ‌రిగే కార్య‌క్ర‌మాలు. అయిన‌ప్ప‌టికీ.. మంత్రులు మాత్రం త‌గుదున‌న‌మ్మా! అంటూ.. వ‌చ్చేస్తున్నారు. దీంతో ఈ విష‌యాలు ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో జోరుగా వైర‌ల్ అయి.. మంత్రుల‌పై నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు.