Begin typing your search above and press return to search.
బెజవాడ ఆగ్నిప్రమాదంలో మృతులంతా ఆ మూడు జిల్లాల వారే!
By: Tupaki Desk | 9 Aug 2020 2:00 PM GMTఊహించని విధంగా చోటు చేసుకున్న ఆగ్నిప్రమాదంతో ఏపీ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున విజయవాడలోని కోవిడ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగటం.. క్షణాల్లో మంటలు వ్యాపించటం.. దట్టమైన పొగ అలుముకోవటంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. అప్పటికే అనారోగ్యంగా ఉన్న వారు.. జరిగింది అర్థం చేసుకొని ప్రాణాలు కాపాడుకోవటానికి ప్రయత్నం చేసే లోపే మృత్యువు వారిని కాటేసింది.
ప్రమాదం జరిగిన సమయంలో కోవిడ్ సెంటర్లో మొత్తం యాబై మంది వరకు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రమాదంలో మొత్తం పది మంది మరణించగా.. మిగిలిన బాధితుల్ని దగ్గర్లోని కొవిడ్ సెంటర్లకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇదిలాఉంటే.. మరణించిన వారంతా మూడు జిల్లాలకు చెందిన వారే కావటం గమనార్హం. మరణించిన పది మందిలో ఒక్కరు గుంటూరుజిల్లాకు చెందిన వారు కాగా.. అత్యధికులు క్రిష్ణా జిల్లాకు చెందిన వారు. మిగిలిన వారు ప్రకాశం జిల్లాకు చెందిన వారు.
మరణించిన వారి పేర్లు.. వివరాల్ని గుర్తించారు. వారిలో ముగ్గురు తప్పించి అందరిని గుర్తించారు. పది మందికి పోస్టుమార్టం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం వారిని బంధువులకు అప్పగించనున్నారు. కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేసిన రమేశ్ ఆసుపత్రితో పాటు.. స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. ఇక.. మరణించిన వారి విషయానికి వస్తే.. వారిలో క్రిష్ణ జిల్లాకు చెందిన వారు ఆరుగురు కాగా.. ప్రకాశం జిల్లాకు చెందిన వారు ముగ్గురు.. ఒక్కరు మాత్రం గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన వారు.
మరణించిన వారు ఎవరంటే..
01. డోక్కు శివ బ్రహ్మయ్య (58) - మచిలీపట్నం
02. పూర్ణ చంద్ర రావు మొవ్వ
03. సుంకర బాబు రావు (రిటైర్డ్ ఎస్సై) - సింగ్ నగర్
04. మజ్జి గోపి (మచిలీపట్నం)
05. సువర్ణ లత పొన్నూరు - నిడుబ్రోలు
06. వెంకట లక్ష్మి సువర్చలా దేవి -(జయ లక్ష్మి) కందుకూరు
07. వెంకట లక్ష్మి సువర్చలా దేవీ (కందుకూరు)
08. ఎం. రమేష్ (విజయవాడ)
09. పవన్ కిషన్ (కందుకూరు)
10. చర్చి ఫాదర్ అబ్రహం(జగ్గయ్యపేట)