Begin typing your search above and press return to search.
మోడీ గారి మంత్రులు...స్ట్రాంగ్ పార్టీలే సుమా...
By: Tupaki Desk | 6 Oct 2021 9:30 AM GMTమోడీ గురించి ఈ దేశ ప్రజానీకానికి ఒక అవగాహన ఉంది. ఆయన వివాహం చేసుకున్నా కూడా ఒంటరిగానే ఉంటున్నారు. దేశం కోసం ఆయన తన జీవితాన్ని అర్పించారు. ఆయనకంటూ ప్రత్యేకంగా ఏమీ దాచుకోవడానికి లేదు. ఆయన ఒక క్లీన్ వైట్ పేపర్ అని అంతా ఒప్పుకుంటారు. మోడీకి ఏ పేచీ పూచీ లేనందువల్లనే అది ప్లస్ పాయింట్ అయింది. ఆయన్ని రెండు సార్లు దేశానికి ప్రధానిని చేయడానికి కూడా ఆ క్వాలిఫికేషనే కారణం. ఆయనకు ఏ సంసార బంధాలు లేవు. తానూ దేశం తప్ప మరోటి ఆయనకు తట్టదు అని కమలనాధులు కూడా గర్వంగా చెప్పుకుంటారు.
సరే మోడీ వరకూ ఓకే కానీ ఆయన చుట్టూ ఉన్న వారు కాదు కదా అనే అంతా అంటారు. నిజానికి మోడీ నీడ తోడు అయిన అమిత్ షా కూడా ఒంటరి కాదు, సంసార బంధంలో చిక్కుకున్నవారే. అలాగే తక్కిన మంత్రులు కూడా. ఎవరి బాధలు, బాధ్యతలు వారికి ఉంటాయి. ఇవన్నీ ఎందుకు అంటే తాజాగా కేంద్రంలోని మోడీతో సహా చాలా మంది మంత్రుల ఆస్తుల వివరాలు చూస్తే మోడీ మాస్టార్ నిమ్మళంగా ఉన్నా పక్కన ఉన్న వారు బహు గట్టి పిండాలు అనిపించకమానదేమో.
మోడీకి ఆస్తులు పెరిగాయి అని ఒక నివేదిక వచ్చింది. ఆయన ఏ వ్యాపారాలు చేయరు, ఏ స్టాక్ ఎక్సేంజిలో పెట్టుబడులు పెట్టరు, మరి ఆయన ఆదాయాలు ఎలా పెరిగాయి అంటే కేవలం బ్యాంకులలో ఫిక్స్ డ్ డిపాజిట్లు పెట్టడం వల్ల పెరిగినదే అది అని తెలుస్తోంది. గత మూడేళ్ళలో మోడీ ఆస్తుల విలువ ఇరవై రెండు లక్షలు పెరిగాయి అంటే అది బ్యాంకులలో దాచిన సొమ్ము పుణ్యమే తప్ప మరోటి కాదని తేటతెల్లంగా తెలుస్తోంది. అదే సమయంలో అమిత్ షా వారి ఆదాయాలు పెరిగాయి ఎలా అంటే ఆయనతో పాటు ఇతర కేంద్ర మంత్రులు కూడా పలు స్టాక్ ఎక్సేంజిలలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు విపరీతంగా వచ్చాయి. అంటే వారంతా చాలా తెలివిగా వేసిన స్టెప్, పొదుపుగా వేసిన అడుగు అనే చెప్పాలి. ఆ విధంగా అమిత్ షా గణనీయంగా లాభాలు గడించి మోడీ మంత్రుల్లో టాప్ తానే అనిపించుకున్నారు. అలా అమిత్ షా నికర ఆస్తుల విలువ 32 శాతం పెరిగి రూ.37,91,50,580 రూ.38 కోట్లుగా ఉందని లెక్కలు చెబుతున్నారు.
ఇదే వరసలో మరో కేంద్ర మంత్రి పీయూష్ ఘోయల్ షేర్లకు 96 శాతం మేర అధిక లాభాలు వచ్చాయి. ఆయన అపర కుబేరుడు అనిపించుకున్నారు. కేవలం రెండేళ్ల వ్యవధిలో 2.72 కోట్ల నుంచి 5.33 కోట్లకు ఎగబాకారు ఇక మరో మంత్రి షేర్ల పెట్టుబడుల విలువ 18.6 లక్షకు ఎదిగింది అంటే ఆయన యమ స్మార్ట్ అనే కదా లెక్క. ఇలా వరసగా చూసుకుంటే అశ్విన్ వైష్ణవ్ షేర్ల విలువ 6.23 లక్షలకు పెరిగితే మరో మంత్రి జ్యోతీరాదిత్య మొత్తం ఆస్తి విలువ 35.5 కోట్లకు పెరిగింది. ఇక చిత్రమేంటి అంటే రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఆస్తి మాత్రం రెండేళ్ళలో తగ్గింది. అలాగే ఆర్ధిక మంత్రి అన్నీ తెలిసిన నిర్మలా సీతారామన్ నికర ఆస్తి విలువలో పెద్దగా మార్పు లేదని అంటున్నారు. మొత్తానికి మోడీ టీమ్ లో చాలా మంది మంత్రులు బలవంతులే కాదు ధనవంతులు కూడా సుమా అని చెప్పాల్సి ఉంది.