Begin typing your search above and press return to search.
హైవేల మీద అవినీతి ఎంతో చెప్పిన తాజా సర్వే
By: Tupaki Desk | 1 March 2020 4:34 AM GMTరోడ్ల మీద ప్రమాదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రోజు పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకిలా? అన్న ప్రశ్న. దీనికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేసింది సేవ్ లైఫ్ అనే ఎన్జీవో. ప్రతి ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్న వైనంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన ఈ సంస్థ.. సమస్య మూలాల్లోకి వెళ్లింది. విస్తుపోయే నిజాల్ని బయటపెట్టింది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా 10 నగరాల్లో 1217 మంది డ్రైవర్లు.. 101 మంది వాహన యజమానులకు పలు ప్రశ్నల్ని సంధించింది.
రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ఇటీవల కేంద్రప్రభుత్వం కొత్త మోటారు వాహన చట్టాన్ని తీసుకొచ్చినా.. ఫలితం మాత్రం పెద్దగా లేని పరిస్థితి. ఎందుకిలా? అసలు ప్రమాదాలకు అసలు కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకుసమాధానాలు వెతికితే. హైవేల మీద ప్రయాణించే ట్రక్కు డ్రైవర్లు యాభై శాతానికి పైనే నిద్ర వస్తున్నా డ్రైవింగ్ చేస్తున్నారన్న కఠిన నిజం బయటకు వచ్చింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే డ్రైవర్లలో 22 శాతం మంది మత్తు పదార్థాల్ని తీసుకొని వాహనాల్ని డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తించారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణం ట్రక్కులే. ట్రక్కు డ్రైవర్లు.. వాహన యజమానులు ప్రతి ఏటా హైవేల మీద లంచం రూపంలో చెల్లిస్తున్న మొత్తం రూ.48 వేల కోట్లుగా తేలింది. 2006-07లో ఇది రూ.22వేల కోట్లుగా ఉండేదని చెబుతున్నారు.
దీనికి తోడు సరైన శిక్షణ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందటం.. అలసటగా ఉన్నప్పటికీ డ్రైవింగ్ చేయటం.. పని గంటలు భారీగా ఉండటం కూడా ప్రమాదాలకు కారణంగా చెబుతున్నారు. సగటున ట్రక్కు డ్రైవర్లు రోజూ పన్నెండు గంటలు డ్రైవ్ చేస్తున్న చేదు నిజం బయటకు వచ్చింది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు ట్రక్కు డ్రైవర్లలో 22 శాతం మంది ఉన్నట్లుగా గుర్తించారు. ఈ అంశాలే రోడ్డు ప్రమాదాలకు మూలమన్న మాట వినిపిస్తోంది.