Begin typing your search above and press return to search.
నకిలీ ట్వీట్..యూనిలీవర్ సంస్థకు పది కోట్ల బొక్క..ఓ నిజం
By: Tupaki Desk | 13 March 2019 1:30 AM GMTఊహించని వివాదం చుట్టుముట్టడం...అందులో కొందరి ఆగ్రహావేశాలు సృజనాత్మక రూపంలో ప్రచారంలో పెట్టడంతో ఓ అంతర్జాతీయ సంస్థ ఏకంగా పది కోట్ల రూపాయల మేర కోల్పోయిందనే వార్త వైరల్ అయిన ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. కేవలం సోషల్ మీడియాలో ప్రచారం కోసమే ఆ సంస్థకు ఇప్పటికే పది కోట్లు నష్టపోయేందుకు కారణంగా మారగా...ఈ నష్టం మరింత పెరనుందనే ఆందోళన ఆ సంస్థలో వ్యక్తమవుతోందనే ప్రచారం చేసేందుకు ఓ మీడియా సంస్థను వాడుకున్న నేపథ్యంలో..సదరు సంస్థ వివరణ ఇచ్చింది. ఈ ప్రచారంలో బాధిత సంస్థగా మారిన మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ మేరకు స్పష్టత ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే, తాజాగా హోలీ పండగను పురస్కరించుకొని హిందూ, ముస్లింల ఐక్యతను చూపుతూ రంగుల పండుగ హోలీ మతాలకతీతంగా అందరినీ దగ్గర చేస్తుందనే థీమ్ తో సర్ఫ్ ఎక్సెల్ ఓ యాడ్ చేసింది. మత సామరస్యానికి ప్రతీకగా హిందూ బాలిక.. ముస్లిం బాలుడు నిమిషం నిడివిగల యాడ్ లో నటించారు. ఈ యాడ్ లో ముందుగా ఒక చిన్నారి(హిందూ) సైకిల్ పై వస్తుంది. తనపై రంగులు వేయాలని అపార్ట్ మెంట్ బాల్కనీల్లో ఉన్న పిల్లలను అడుగుతుంది. హోళీ సంబరాల్లో ఉన్న వారంతా ఆమెపై రంగుల బెలూన్లు విసురుతారు. అలా ఇంకా వేయండని చెప్తుంది. ఇలా పిల్లలందరూ రంగుల బెలూన్లు ఆమెపై విసురుతూనే వుంటారు. వాళ్ల దగ్గర ఉన్న రంగులు అన్నీ అయిపోతాయి. అప్పుడు అక్కడే పక్క అపార్ట్ మెంట్ లో ఉన్న ముస్లిం బాలుడిని రమ్మని ఆ చిన్నారి పిలుస్తుంది. తెలుపు దుస్తులు ధరించిన బాలుడు వెంటనే వచ్చి ఆమె సైకిల్ వెనకాల కూర్చుంటాడు. పైనున్న పిల్లలు అతనిపై రంగులు వేయటానికి ప్రయత్నిస్తారు కానీ రంగులు అయిపోతాయి.
ఇంతలోనే బాల్కానీలో ఉన్న ఓ పిల్లాడు రంగులు చల్లబోతుంటే పక్కనున్న మరో చిన్నారి అడ్డుకుంటుంది. ఇక ఆ బాలుడు సంతోషంగా ఆమె సైకిల్ పై మసీదు వద్దకు వెళ్తాడు. మసీద్ లోపలికి వెళ్తూ.. నమాజ్ అయిపోయాక కలుద్దామని ఆ బాలుడు చెబుతాడు. దానికి ఆ చిన్నారి కూడా బయటకి వచ్చిన తర్వాత రంగులతో తడిసిపోవాల్సిందేనని అంటూ అక్కడి నుంచి వెళ్తుంది. ఒక నిమిషం నిడివిగల ఈ ప్రకటనలో బ్యాగ్రౌండ్ లో హిందూ సాంగ్ 'రంగ్ లాయే సంగ్' వస్తుంది. ‘మంచి కారణం కోసం మరక అయితే.. ఆ మరక మంచిదే’ అనే ట్యాగ్ లైన్ తో యాడ్ ముగుస్తుంది. ప్రస్తుతం ప్రకటనపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తూ..ట్రోల్ చేస్తున్నారు. #boycottSurfexcel హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.
అయితే, కొందరు టైమ్స్ ఆఫ్ ఇండియా లోగోతో ట్విట్టర్ లో `హిందువులపై విద్వేష పూరిత యాడ్ వేసిన ఫలితంగా హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థకు ఇప్పటికే పది కోట్లు నష్టం వాటిల్లింది. ఇది మరింత పెరగనుంది``అంటూ ఓ ట్వీట్ వైరల్ చేశారు. ఈ అంశం తమ దృష్టికి రావడంతో హెచ్ యూఎల్ స్పందించి తాము అలాంటి వార్తాకథనం ప్రచురించలేదని తెలిపింది.