Begin typing your search above and press return to search.
దేత్తడి షాకింగ్ నిర్ణయం.. అంబాసిడర్ గా తప్పుకుంటున్నా.. థ్యాంక్యూ
By: Tupaki Desk | 11 March 2021 4:15 AM GMTఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువ యూట్యూబర్ కమ్ బిగ్ బాస్ ఫేం దేత్తడి హారిక.. గడిచిన రెండు రోజులుగా తనకు సంబంధంలేని మొయిన్ స్ట్రీమ్ వార్తల్లోకి వచ్చేయటం తెలిసిందే. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమితురాలైన ఆమెకు వరుస పెట్టి ఎదురవుతున్న చేదు అనుభవాలకు పుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. అందుకే.. పిలిచి ఇచ్చిన బ్రాండ్ అంబాసిడర్ పోస్టును పక్కన పెట్టేసి.. తాను ఆ పదవి నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక చిన్న వీడియోను పోస్టుచేసిన ఆమె.. ఒక చిన్న అప్డేట్ అంటూ.. సింఫుల్ గా ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా తాను తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి తప్పుకుంటున్నట్లుగా షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించారు.
దేత్తడి హారికను తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం.. తెలంగాణ ప్రభుత్వానికి.. తెలంగాణ రాష్ట్ర మంత్రితో పాటు టూరిజం శాఖ ఉన్నతాధికారులకు తెలీకుండానే ఆమె నియామకం జరిగిందన్న ప్రచారం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో టూరిజం శాఖ ఎండీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా వైపు వేళ్లు చూపిస్తున్నాయి. అనుకోని రీతిలో వివాదంలో చిక్కుకున్న దేత్తడి.. తాజాగా తన ఇన్ స్టాలో ఒక వీడియో పోస్టు చేశారు.
‘‘అందరికి నమస్తే. ఒక చిన్న క్విక్ అప్డేట్. ఉమెన్స్ డే రోజు నన్ను టీఎస్ టీడీపీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయటం దగ్గర నుంచీ ఏం జరిగిందో మీ అందరికి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల నేను ఆ పదవిలో కొనసాగట్లేదు. ఆ పదవి నుంచి తప్పుకుంటున్నా. నాకు సపోర్టు చేసిన వాళ్లందరికి చాలా కృతజ్ఞతలు. ఇక్కడి నుంచి మన సిరీస్‌లపై నేను ఇంకాస్త ఎక్కువ దృష్టి పెట్టబోతున్నాను. నేను తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను’’ అని హారిక తాను చెప్పాల్సిన విషయాన్ని చెప్పేశారు.మొత్తంగా తనకు ఏ మాత్రం సంబంధం లేని విషయంలో..ఆమెను తెర మీదకు తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేశారని చెప్పక తప్పదు. ఈ మొత్తం ఎపిసోడ్ ఆమెను ఎప్పటికి బాధిస్తుందనే చెప్పాలి.