Begin typing your search above and press return to search.
దేవాన్ష్ ను సైతం వాడేయటం మొదలెట్టేశారోచ్
By: Tupaki Desk | 9 Aug 2017 10:26 AM GMTమొహమాట పడుతుంటారు కానీ ఎవరైనా పొగిడేస్తుంటే చాలా హాయిగా ఉంటుంది. వద్దని వారిస్తున్న వేళ.. అదే పనిగా పొగుడుతున్నా.. మాటలతో ఆకాశానికి ఎత్తేస్తుంటే.. ఆ హాయి మరిక దేనిలోనూ రాదని చెప్పక తప్పదు. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారిని పొగిడేసే కార్యక్రమాన్ని అనుచర గణం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. అయితే.. వారికి మించి మరీ.. ఒక జర్నలిస్ట్ చేసిన పని ఇప్పుడు జర్నలిస్ట్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకున్న ఇమేజ్ ఆకాశమంతా అని చెప్పినా.. ఆయన మీద హద్దులు దాటిన అభిమానంతో విగ్రహాలు పెట్టటం లాంటివి ఇప్పటివరకూ జరగలేదని చెప్పాలి. ఇక.. బాబుగారి అబ్బాయి చినబాబు గురించి వస్తే.. ఆయన గురించి సామాన్య జనానికి తెలిసింది తక్కువే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చినబాబు కంటే చినబాబు కొడుకు అదేనండి దేవాన్ష్ గురించి మాత్రం చాలామందికి ఐడియా ఉందనే చెప్పాలి.
అవసరం ఉన్నా.. లేకున్నా చంద్రబాబు సైతం తన మనమడి ముచ్చట్లు మీడియాలో చెప్పటం.. ఇంటి విషయాలు పెద్దగా ప్రస్తావించని బాబు లాంటి నేత నోట మనమడి మాటలు.. ప్రస్తావన రావటంతో దేవాన్ష్‌కు ఎంత ప్రచారం జరగాలో అంత ప్రచారం జరిగిపోయింది. అసలు కంటే కొసరు ముద్దు అన్న చందంగా దేవాన్ష్‌ను చాలామంది అభిమానిస్తూ ఆరాధిస్తుంటారు.
ఇక.. దేవాన్ష్ ముచ్చట తీసుకొస్తే బాబు ముఖంలో ప్రసన్నత ఇట్టే వచ్చేస్తుందని.. ఆయన మూడ్ మారిపోతుందన్న విషయాన్ని ఇప్పటికే కొందరు గుర్తించి.. బాబు మనసును దోచుకుంటున్నారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వేళ.. తాజాగా ఒక జర్నలిస్ట్ చేసిన ప్రయత్నం అందరిని అవాక్కు అయ్యేలా చేయటమే కాదు.. బుల్లిబాబు ముచ్చట్లతో చంద్రబాబును ఫ్లాట్ చేయటం ఎలా చూశామని చెబుతున్నారు. అసలేం జరిగిందన్నది చూస్తే.. మీడియా ప్రతినిధులతో నిత్యం టచ్ లో ఉండే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వారికి మాత్రం చేసిందేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంటుంది. మీడియా ప్రతినిధులు నలుగురు కలిస్తే ఇదే విషయం మీద మాట్లాడుకోవటం కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా అమరావతిలో మీడియా సంస్థల ప్రతినిధులతో ఇష్టాగోష్టిని ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆ మీటింగ్ ఉద్దేశం ఏమిటంటే.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం దగ్గర నుంచి.. వారి సంక్షేమం గురించి తీసుకోవాల్సిన చర్యల మీద మాట్లాడుకోవటం. దీంతో.. బాబును విపరీతంగా అభిమానించి.. ఆరాధించే జర్నలిస్టు భక్తులు ఆ విందుకు వెళ్లారు.
ఈ విందులో జర్నలిస్టులకు బాబు భారీ హామీనే ఇచ్చారు. అమరావతి మీడియా వారికి ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్‌లు కట్టించి ఇస్తామన్న హామీని ఇచ్చారు చంద్రబాబు. దీనికి సంబంధించిన విధివిధానాల్ని కూడా రూపొందించనున్నట్లుగా వెల్లడించారు. బాబు నోటి నుంచి వచ్చిన తాజా వరంతో పులకించిపోయిన ఒక జర్నలిస్టు రియాక్ట్ అయి.. బాబు ఆలోచన అద్భుతమని.. తమకు చెప్పినట్లుగా ట్రిపుల్ బెడ్రూం ఇస్తే.. ఆ కాలనీకి దేవాన్ష్ కాలనీ అని నామకరణం చేస్తానని మాట ఇచ్చేశారట. దీంతో.. అక్కడున్న మిగిలిన జర్నలిస్టులు అవాక్కు అయినట్లుగా చెబుతున్నారు.
దేవాన్ష్ ముచ్చట రాగానే బాబు ముఖంలో వెల్లివిరిసిన చిరుదరహాసం.. ఆ ఐడియా తమకు రానందుకు మరికొందరి జర్నలిస్టుల బాధ.. సమావేశం ముగిశాక కూడా హాట్ టాపిక్ గా మారాయట. బుల్లిబాబు ప్రస్తావనతో బాబు ఎంతగా పులకించిపోతారన్న విషయం ఇప్పుడు జర్నలిస్టు సర్కిల్స్ లో ఆసక్తికర చర్చగా మారింది.