Begin typing your search above and press return to search.
మనవళ్ల కోసం మాజీ ప్రధాని త్యాగం, కాంగ్రెస్ గరం!
By: Tupaki Desk | 24 March 2019 1:30 AM GMTతన మనవళ్లకు అవకాశాలను ఇవ్వడానికి తను సీటును త్యాగం చేశారు మాజీ ప్రధాని దేవేగౌడ. తన వారసుల్లో ఒక్కొక్కరికి అవకాశం ఇస్తూ వస్తున్న దేవేగౌడ ఇప్పుడు మరో మనవడికి అవకాశం ఇవ్వడానికి హాసన సీటును త్యాగం చేశారు. ఇప్పటికే దేవేగౌడ కుటుంబీకులు రాజకీయ వారసత్వాలతో బిజీగా ఉన్నారు. దేవేగౌడ ఒక కుమారుడు కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.
కొన్ని నెలల కిందట జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జాక్ పాట్ గా కుమారస్వామికి సీఎం సీటు దక్కింది. ఇక కుమారస్వామి కేబినెట్లో దేవేగౌడ మరో కుమారుడు రేవణ్ణ మంత్రిగా ఉన్నారు. ఇలా అన్నదమ్ములిద్దరూ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు.
ఇక తమ కుటుంబానికి రాజకీయంగా పెట్టని కోట అయిన హాసన నియోజకవర్గం నుంచి దేవేగౌడ ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుత లోక్ సభలో కూడా ఆయన మెంబర్ గా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో దేవేగౌడ మనవళ్లు రాజకీయ ఆరంగేట్రానికి ఉబలాటపడుతూ ఉన్నారు. ఇప్పటికే ఒక మనవుడు నిఖిల్ గౌడ పోటీకి నియోజకవర్గం ఖరారు అయ్యింది.
జేడీఎస్ కు అనుకూల ప్రాంతం అయిన మండ్య నుంచి నిఖిల్ గౌడ పోటీ చేస్తూ ఉన్నాడు. ఇతడు ఒక సినిమాలో హీరోగా కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇక దేవేగౌడ మరో మనవడు, రేవణ్ణకుమారుడు పోటీకి కూడా ఇప్పుడు రంగం సిద్ధం అయ్యింది. అతడి కోసం తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని త్యాగం చేస్తున్నారు దేవేగౌడ.
హాసన నుంచి రేవణ్ణ కుమారుడు ఈ ఎన్నికల బరిలో నిలవబోతూ ఉన్నాడట. అయితే దేవేగౌడ పూర్తిగా త్యాగం చేయడం లేదు. ఆయన కూడా ఈ ఎన్నికల బరిలో నిలుస్తారట. అందు కోసం తుమకూరు సీటును పరిగణనలోకి తీసుకున్నారని సమాచారం. ఆ సీటు నుంచి దేవేగౌడ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారట.
అయితే అక్కడ కాంగ్రెస్ నేత ఒకరు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. దేవేగౌడకు సీటును త్యాగం చేసేందుకు ఆయన రెడీగా లేరు. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ లు కలిసి పోటీ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆ సీటు రాజకీయం ఆసక్తికరంగా మారింది. మనవడి కోసం త్యాగం చేసిన దేవేగౌడ కోసం కాంగ్రెస్ నేత త్యాగం చేస్తారా?