Begin typing your search above and press return to search.

చంద్రబాబు.. బాలయ్యలను ఒక ఆట ఆడుకున్న దేవాన్ష్

By:  Tupaki Desk   |   16 Jan 2023 5:30 AM GMT
చంద్రబాబు.. బాలయ్యలను ఒక ఆట ఆడుకున్న దేవాన్ష్
X
కోట్లాది మందికి ఆరాధ్యనీయులు కావొచ్చు. ఇంటికి వచ్చేసరికి బంధాలకు బంధీలుగా ఉండటం మనిషికి మాత్రమే సాధ్యం. ఊరంతటిని ఏలే వ్యక్తి.. ఇంటికి వచ్చిన తర్వాత అన్నకు తమ్ముడిగా.. భార్యకు భర్తగా.. పిల్లలకు తండ్రిగా.. మనమళ్లకు తాతగా తమదైన పాత్రల్ని పోషిస్తుంటారు.

అలాంటి సన్నివేశం కళ్లకుకట్టినట్లుగా కనిపించింది ఈ సంక్రాంతి పండక్కి. దాదాపు మూడేళ్ల తర్వాత నారావారి ఫ్యామిలీ.. నందమూరి ఫ్యామిలీకి చెందిన వారంతా చంద్రబాబు సొంతూరు నారావారి పల్లెకు రావటం.. పండుగ రోజుల్ని సరదాగా గడపటం తెలిసిందే. ఈ సందర్భంగా లోకేశ్ - బ్రాహ్మణిల కుమారుడు దేవాన్ష్ అల్లరి అందరిని ఆకర్షించింది.

ఈ రెండు కుటుంబాలకు చెందిన సంక్రాంతి వేడుకల్ని చూసేందుకు జనం భారీగా హాజరైన పరిస్థితి. వారు ఎక్కడకు వెళితే.. అక్కడికి వారిని చూసేందుకు భారీగా జనం తరలి వస్తున్న పరిస్థితి. పండుగ వేళల్లో తిరుపతి నాగాలమ్మకట్ట వద్దకు ఈ రెండు కుటుంబాలకు చెందిన వారు వచ్చారు. ఇంట్లోని మహిళలు అమ్మను కొలుస్తూ పూజల్లో బిజీగా ఉంటే.. చంద్రబాబు.. బాలక్రిష్ణలు మాత్రం బయట మనమడితో కాలక్షేపం చేశారు.

ఈ సందర్భంగా దేవాన్ష్ అల్లరి అందరిని ఆకర్షించింది. ఇద్దరు తాతలను ఒక ఆట ఆడుకున్న తీరు అందరూ నవ్వుకునేలా చేసింది. చంద్రబాబు కూర్చున్న కుర్చీ తనకు కావాలంటూ మనమడు దేవాన్ష్ అడగటం.. ఇక తప్పనిపరిస్థితుల్లో కుర్చీ నుంచి లేచి..

మనమడికి ఇచ్చేశారు చంద్రబాబు. మరో తాత బాలక్రిష్ణ నెత్తి మీద వాటర్ బాటిల్ తో కొట్టిన ఘనత కూడా దేవాన్ష్ సొంతం చేసుకున్నాడని చెప్పాలి. ఇలా.. తన ఆటలతో.. మాటలతో దేవాన్ష్ ఈ సంక్రాంతి వేడుకులకు స్పెషల్ అట్రాక్షన్ గా మారారని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.