Begin typing your search above and press return to search.
ఐదేళ్ల అధికారం.. ఉత్తి మాటే..!
By: Tupaki Desk | 25 July 2019 4:20 AM GMTమాజీ ప్రధాని ట్యాగ్ తో నిత్యం వార్తల్లోకెకేక్క హెచ్ డీ దేవెగౌడ.. కర్ణాటకతో పాటు జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించారు. అయితే దేవెగౌడ - ఆయన కుమారుడు రాజకీయాల్లో చాలా ఉచ్ఛ స్థాయిలో ఉన్నప్పటికీ అధికారంలో మాత్రం ప్రతిసారీ బోల్తా పడుతున్నారు. చరిత్ర - రాష్ట్ర రాజకీయాలు - ప్రస్తుత పరిస్థితుల ద్వారా స్పష్టం అవుతోంది. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన దేవెగౌడ.. భుజంపై శాలువా - పంచ కట్టుతో చాలా సాదాసీదాగా ఉంటారు.
అలాంటి ఆయన దేశానికి 11వ ప్రధానిగా 1996 జూన్ 1న బాధ్యతలు స్వీకరించారు. దక్షిణ భారతదేశం నుంచి ప్రధానిగా మారిన రెండో వ్యక్తిగా కూడా దేవెగౌడ నిలిచారు. అప్పటి పరిస్థితుల్లో రాజకీయ అంతర్గత కుమ్మలాటల కారణంతో ఆయన కేవలం 12 నెలలు మాత్రమే ప్రధానిగా కొనసాగారు. ఇక కర్ణాటక విషయానికి వస్తే 1994లో రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి కేవలం రెండేళ్లు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు.
కర్ణాటకలోనే కాకుండా దేశ వ్యాప్తంగా పేరొందిన దేవెగౌడకు పూర్తి స్థాయిలో ఐదేళ్లు అధికారంలో ఉండటం నాటి నుంచి సాధ్యం కాలేదు. ఆయనతో పాటు కుటుంబంలో కూడా ఎవరూ ఐదేళ్లు అధికారంలో కొనసాగలేకపోతున్నారు. 1996లో కేంద్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన పరిస్థితుల్లో మరోసారి ప్రధాని అయిపోవాలని పీవీ నరసింహారావు ప్రయత్నాలు చేసినా.. విజయం సాధించలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో లోక్ సభ ఎన్నికల్లో 161 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది.
అయితే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీకి మద్దతుగా చాలా మంది ముందుకు వచ్చారు. ఆ సమయంలో ప్రధాని రేసులో వీపీ సింగ్ - హరికిషన్ సింగ్ సుర్జీత్ - లాలు ప్రసాద్ యాదవ్ - ములాయం సింగ్ యాదవ్ - జ్యోతిబసు వంటి హేమాహేమీలు పోటీలో ఉన్నారు. కానీ అదృష్టం మాత్రం హెచ్ డీ దేవెగౌడను వరించింది. ఆ సమయంలో కర్ణాటకలో జనతాదళ పార్టీ 16 ఎంపీ స్థానాలను గెలుచుకోవడంతో ప్రధానిగా దేవెగౌడ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
అది 2004.. ధరంసింగ్ - సిద్ధరామయ్య నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇందుకు ప్రముఖ కారణం మాత్రం జేడీఎస్ అనే చెప్పవచ్చు. ఆ సమయంలో ఉపముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య - ముఖ్యమంత్రిగా ధరంసింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే దేవెగౌడ - సిద్దరామయ్య మధ్య నెలకొన్న విభేదాల కారణంగా జేడీఎస్ నుంచి సిద్ధరామయ్య బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఉపముఖ్యమంత్రి పదవి దివంగత ఎంపీ ప్రకాశ్ కు దక్కింది. కానీ కొన్ని కారణాలతో కాంగ్రెస్ కు జేడీఎస్ తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో మళ్లీ కొద్దికాలమే జేడీఎస్ అధికారంలో కొనసాగింది. ఇక 2006లో రాష్ట్రంలో 20–20 సర్కార్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ - జేడీఎస్‌లు ఒప్పందానికి వచ్చి అధికారాన్ని పంచుకున్నాయి. ఆ సమయంలో తొలుత కుమారస్వామి సీఎంగా అధికారం చేపట్టి ఉప ముఖ్యమంత్రి పదవిని యడ్డూరప్పకు కేటాయించారు.
కానీ 20 నెలలు గడిచిన తర్వాత సీఎం పదవి నుంచి తొలగిపోయేందుకు కుమారస్వామి ససేమిరా అన్నారు. బీజేపీకి అధికారాన్ని అప్పగించేందుకు కుమారస్వామి ఒప్పుకోలేదు. ఫలితంగా ప్రభుత్వం కూలిపోయింది. ప్రస్తుతం కూడా కుమారస్వామి ప్రభుత్వం కేవలం 14 నెలలకే కుప్పకూలింది. గత 2018 విధానసభ ఎన్నికల్లో హంగ్ రావడంతో కాంగ్రెస్ - జేడీఎస్ కలిసి సంకీర్ణం ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఏడాది పూర్తి కాగానే - మళ్లీ రాజకీయ రగడ ప్రారంభమైంది. అసంతృప్త ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో గందరగోళం నెలకొంది. మళ్లీ కుమారస్వామికి సంకట స్థితి తలెత్తింది. అయితే మంగళవారం ఎట్టకేలకు విశ్వాస పరీక్షలో తన మెజారిటీని నిరూపించుకోలేక ఓడిపోయారు. దీంతో తన 14 నెలల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.