Begin typing your search above and press return to search.
కర్ణాటకలో కాంగ్రెస్ తో పొత్తుకు అప్పుడే బీటలు..
By: Tupaki Desk | 27 May 2018 4:56 AM GMTకాపురం మొదలెట్టి కొన్ని రోజులే అయ్యింది.. అప్పుడే జేడీఎస్ అధినేత దేవెగౌడ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. జేడీఎస్ చీఫ్ హెచ్ డీ దేవెగౌడ శనివారం రాజరాజశ్వరీ నగర్ శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. తాము సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ జేడీఎస్ అమ్మకానికి లేదన్నారు. తన పార్టీ మనుగడ కోసం తాను కృషి చేస్తానన్నారు.
కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పొత్తు విధాన సౌధ (శాసనసభ)కే పరిమితమని దేవెగౌడ కుండబద్దలు కొట్టారు. ఎన్నికల్లో జేడీఎస్ విజయం సాధించేందుకు తాను చేయగలిగినంతా చేస్తానని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటులో కలిసి నడుస్తున్న జేడీఎస్, కాంగ్రెస్ లు రాజరాజేశ్వరీ నియోజకవర్గంలో మాత్రం కలిసి పోటీచేయడం లేదు. దీంతో ఆయన కాంగ్రెస్ పై ప్రచారంలో ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో కలిసి ఉన్నంత మాత్రానా తాము కాంగ్రెస్ కలిసి కలకాలం కలిసి ఉంటామని చెప్పలేమని ఆయన చేసిన వ్యాక్యలు దుమారం రేపాయి.
ఈనెల 12న కర్నాటకలో శాసనసభ ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే రాజరాజశ్వరీ నగర్ నియోజకవర్గం పోలింగ్ ను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఓ అపార్ట్ మెంట్ లో దాదాపు 10వేల ఓటర్ ఐడీ కార్డులు దొరకడంతో ఈ నిర్ణయం తీసుకుంది.