Begin typing your search above and press return to search.
మాజీ ప్రధాని నిరాహార దీక్ష
By: Tupaki Desk | 1 Oct 2016 10:27 AM GMTకావేరీ జలాల వివాదం మరింత ముదురుతోంది. సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ కర్ణాటక విధానసౌధ ముందు నిరాహార దీక్ష చేపట్టారు. తీర్పును సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
అక్టోబరు 1 నుంచి నీరు విడుదల చేయాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈలోగా జనతాదళ్(ఎస్) అధినేత - మాజీ ప్రధాని దేవగౌడ బెంగళూరులో ఈ రోజు ఉదయం నుంచి నిరాహారదీక్షకు దిగారు. అది కూడా నిరవధిక నిరాహార దీక్ష. మాజీ ప్రధాని ఒకరు ఇలా నిరవధిక నిరాహార దీక్షకు దిగడం సంచలనంగా మారింది.
కావేరి జలాలపై వాస్తవ పరిస్థితులను సమీక్షించేందుకు నిపుణుల బృందాన్ని ఒక దాన్ని రెండు రాష్ట్రాలకు పంపించాలని కర్ణాటక కోరుతోంది. అయినా, నీరు విడుదల చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో దేవగౌడకు ఆగ్రహం వచ్చింది. దీంతో కర్ణాటక ప్రజల కోసం ఆయన స్వయంగా నిరాహార దీక్షకు దిగారు. మరోవైపు దేవగౌడ దీక్షకు మద్దతుగా మాండ్య - మైసూరు జిల్లాల్లో ప్రజలు కూడా ఆందోళనలకు దిగారు. తాజా పరిణామాల నేపథ్యంలో బెంగళూరులో భద్రత పెంచారు. దేవగౌడ దీక్ష చేస్తున్న ప్రాంతమంతా పోలీసుల అదుపులో ఉంది.