Begin typing your search above and press return to search.
రాహుల్ కోసం ఆయన ప్రధాని పీఠాన్ని త్యాగం చేస్తున్నారట!
By: Tupaki Desk | 19 April 2019 9:58 AM GMTగాలికి పోయే పిండి కృష్ణార్పణం అన్నట్టుగా.. భలే మాట్లాడుతున్నారు కర్ణాటక రాజకీయ నేత దేవేగౌడ. మాజీ ప్రధాని అనే ట్యాగ్ ను కలిగి ఉన్న ఆయన.. తను రాహుల్ కోసం ప్రధాని పీఠాన్ని త్యాగం చేయడానికి రెడీ అని ప్రకటించారు. అక్కడికేదో సిట్టింగ్ ప్రధాని అయినట్టుగా, తనే ప్రధానమంత్రి కాబోతున్నట్టుగా దేవేగౌడ మాట్లాడుతూ ఉండం విశేషం.
తనకు మళ్లీ ప్రధాని కావాలని లేదంటూ ఈయన వైరాగ్యాన్ని ప్రదర్శించారు. ఈ సారి అవకాశం రాహుల్ కు దక్కాలని ఈయన చెప్పుకొచ్చారు. రాహుల్ ప్రధానమంత్రి కావాలని, ఆయనకు తను పూర్తి సహకరం అందిస్తానంటూ దేవేగౌడ చెప్పుకొచ్చారు.
మరోసారి ప్రధానమంత్రి కావాలని తనకు లేదని, మళ్లీ మోడీ ప్రధాని ఎక్కడ అవుతారో..అనేదే తన ఆందోళన అని దేవేగౌడ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తమ పార్టీని బాగా చూసుకుందని, సోనియాగాంధీ తమకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారని..అలాంటి ఆమె తనయుడు ప్రధాని కావడానికి తమ సహకారం అందిస్తామని దేవేగౌడ చెప్పారు.
మోడీ మాత్రం మళ్లీ ప్రధాని కావడానికి వీల్లేదన్నారు. తను రాజకీయం నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం లేదని.. ఎంపీగా ఉంటూ లోక్ సభలో రాహుల్ కు అండగా నిలబడతానంటూ దేవేగౌడ ప్రకటించుకున్నారు.
అయినా ఎందుకు సపోర్టు చేయరులే - కర్ణాటకలో దేవేగౌడ తనయుడు ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ సహకరించింది. కాబట్టి..అందుకు ప్రతిగా రాహుల్ ను దేవేగౌడ సపోర్ట్ చేస్తున్నారు. ఇలా మద్దతును ఇచ్చిపుచ్చుకుంటున్నట్టున్నారు!