Begin typing your search above and press return to search.
కొడుకు సీఎం అవుతున్న వేళ దేవెగౌడ రియాక్షన్
By: Tupaki Desk | 20 May 2018 11:40 AM GMTనా కొడుకును ముఖ్యమంత్రి కావటం చూడాలని ఉంది.. సహకరించరంటూ దేవెగౌడ లాంటి పెద్ద మనిషి నోరు తెరిచి అడిగితే జేడీఎస్ పార్టీకి చెందిన ఏ నేత రియాక్ట్ కాకుండా ఉంటారు. తన మాటలకు సెంటిమెంట్ సెంట్ రాసిన పెద్దాయన తీరుతో.. త్వరలో కుమారస్వామి ముఖ్యమంత్రి కానున్నారు.
బీజేపీ లాంటి పార్టీని..మోడీషా లాంటి వ్యూహచతురత ఉన్న ఘటికులకు బో్ల్తా కొట్టించి మరీ అధికారాన్ని చేపట్టటం మామూలు విషయం కాదు. దేన్నైనా సరే.. మోడీ సీన్లోకి ఉంటే సినిమా మారిపోతుందన్న మాటకు చెక్ చెప్పటమే కాదు.. మోడీషా జోరుకు బ్రేకులు వేయటం పెద్ద విషయమే కాదన్న విషయాన్ని తాజా ఎపిసోడ్‌తో రుజువు చేశారు.
ఇదిలా ఉంటే..తాజాగా చోటు చేసుకున్న పరిణామాల వేళ.. దేవెగౌడ చాలా హ్యాపీగా ఉన్నారు. జేడీఎస్ కు కాంగ్రెస్ పార్టీ భేషరతుగా మద్దతు పలకటంపైన ఆయన హర్షం వ్యక్తం చేసి.. లౌకిక గుర్తింపు ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..జేడీఎస్ కు మరికొన్ని స్థానాలు దక్కి ఉంటే బాగుండేదన్నారు. అయితే..మతతత్త్వ శక్తుల్ని ఆపగలగటంపై సంతృప్తిగా ఉందన్నారు. 2006లో కుమారస్వామి బీజేపీతో జట్టు కట్టటంతో వచ్చిన చెడ్డపేరును.. కళంకాన్ని తాజా పరిణామాలతో తుడిచేసుకున్నట్లు చెప్పారు.
ఆ సమయంలో తానెంత బాధ పడ్డానో తనకు తెలుసన్నారు. తన బాధను కుమారస్వామి అర్థం చేసుకున్నట్లు చెప్పిన దేవెగౌడ.. ప్రస్తుతం జత కట్టనున్న కాంగ్రెస్.. జేడీఎస్ సర్కారు ఐదేళ్లు పూర్తిగా పాలిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దేవెగౌడ నమ్మకం ఎంతవరకూ వర్క్ వుట్ అవుతుందో కాలమే సరైన సమాధానం చెప్పాలి.