Begin typing your search above and press return to search.

దేవెగౌడ సంచలనం: సీఎంగా కుమారస్వామి వద్దు

By:  Tupaki Desk   |   28 Nov 2019 9:06 AM GMT
దేవెగౌడ సంచలనం: సీఎంగా కుమారస్వామి వద్దు
X
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కర్ణాటక ఉప ఎన్నికల తర్వాత బీజేపీకి సీట్లు తగ్గి ప్రభుత్వం పడిపోతే కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ను సీఎం చేస్తే తాము మద్దతు ఇస్తామని దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడంలో కుట్ర చేసిన మాజీ సీఎం - కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వల్లే జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిందని.. ఆయన సన్నిహిత ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని కూల్చారని అప్పట్లో దేవెగౌడ ఆరోపించారు. అనంతరం బీజేపీ 17మంది ఎమ్మెల్యేలను ఫిరాయింప చేసి కుమారస్వామి సర్కారును నేలకూల్చింది. ఈ కుట్రలో సిద్ధరామయ్య హస్తం కూడా ఉందని అనుమానాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఇక కాంగ్రెస్ - జేడీఎస్ పొత్తు ఉండదని జేడీఎస్ నేత కుమారస్వామి తెలిపారు. అయితే తాజాగా జేడీఎస్ నేతల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పనిలేదని దేవెగౌడ తెలిపారు.

దీంతో కాంగ్రెస్-జేడీఎస్ మధ్య బంధం చిగురిస్తోంది. ఉప ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ రాక ప్రభుత్వం పడిపోతే మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి డీకే శివకుమార్ ను సీఎం చేస్తే మద్దతు ఇస్తానని దేవెగౌడ ప్రకటించడం సంచలనంగా మారింది. తన కుమారుడు కుమారస్వామిని సైతం పక్కనపెట్టి శివకుమార్ కు దేవెగౌడ మద్దతు తెలుపడం హాట్ టాపిక్ గా మారింది.