Begin typing your search above and press return to search.
రాజధాని పై బాబు జిమిక్కులు..ఫైర్ అయిన సీనియర్ ఎమ్మెల్యే !
By: Tupaki Desk | 17 Dec 2019 12:08 PM GMTఏపీ అసెంబ్లీ లో రాజధాని నిర్మాణంపై మరోసారి వాడివేడి చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా వైసీపీ సీనియర్ నేత - మాజీ మంత్రి - ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం అనేది కేంద్రీకృతం కాకుండా నిర్మాణాలు చేపట్టాలని - అభివృద్ది అంతా ఒకే ప్రాంతంలో జరగడం వల్ల మరో తెలంగాణ ఉద్యమం పునరావృతం అయ్యె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన హెచ్చరించారు. రాజధాని నిర్మాణంపై ప్రతిపక్ష టీడీపీ గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న సమయంలో అయన ఈ విధంగా స్పందించారు.
భుత్వం గత కొద్ది రోజులుగా చెబుతున్నట్టుగా రాజధాని నిర్మాణాలు ఒకే ప్రాంతంలో కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడ కొనసాగించాలని కోరారు. అప్పుడే వెనకబడిన ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని ఆయన చెప్పారు. ఇక గతంలో రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ అభివృద్ది అంతా కేంద్రీకృతం చేసిందని ఆయన ఆరోపణలు చేశారు. ఒకే ప్రాంతాన్ని అభివృద్ది చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే వెనకబడిన శ్రీకాకుళం తోపాటు రాయలసీమ ప్రాంతాలను పట్టించుకోలేదని - టీడీపీ హయాంలో ఈ రెండు ప్రాంతాలకు ఒక్క ప్రాజెక్టు అయినా ఇచ్చారా అంటూ నిలదీశారు. ఈ ప్రాంతాలు ఒక్క ప్రాజెక్టు పెట్టడానికి కూడ అర్హత కలిగి లేవా అని గత ప్రభుత్వం పై మండిపడ్డారు. ఇక ఏపీ రాజధాని నిర్మాణంపై చంద్రబాబు అనేక జిమ్మిక్కులు చేశారని, దీంతోపాటు గందరగోళానికి గురి చేశారని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం సినిమావాళ్లను ఉపయోగించి ప్లాన్ చేయడం అంత్యంత దారుణం అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ సీనియర్ నేతగా ఉన్న ఈయన రాజధాని పై సభలో ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వం ఆలోచనలపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారనే చర్చ కొనసాగుతోంది.