Begin typing your search above and press return to search.
దేవేందర్ గౌడ్ ఇలా అయిపోయారేంటీ?
By: Tupaki Desk | 15 Aug 2017 10:08 AM GMTతూళ్ల దేవేందర్ గౌడ్... తెలుగు దేశం పార్టీలో సీనియర్ మోస్ట్ నేతగా - గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కేబినెట్ లో హాం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తిగా మనందరికి సుపరిచితులే. అంతగా ఎత్తులేని బక్క పలుచటి రూపమే మన కళ్ల ముందు కదలాడుతుంది. చుట్టూ గన్ మెన్లు ఉంటే... అసలు ఆ వ్యక్తి రూపమే మనకు కనిపించదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోయిన దేవేందర్ గౌడ్... సొంతంగా ఓ వేరు కుంపటి పెట్టుకున్నారు. అయితే ఆ కుంపటి అంతగా కలిసిరాకపోవడంతో ఆయన తిరిగి టీడీపీలోనే చేరిపోయారు. పార్టీలో సీనియారిటీని గుర్తించిన చంద్రబాబు ఆయనకు రాజ్యసభ సీటిచ్చారు.
ఇదే సమయంలో రాజకీయాల్లో అంతగా యాక్టివ్‌గా లేని దేవేందర్ గౌడ్ ను అనారోగ్యం కూడా చుట్టుముట్టినట్టు సమాచారం. ఈ క్రమంలో చాలా రోజుల క్రితమే తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బక్క పలుచటి రూపంలో చాలా బొద్దుగా - మేను అంతా వాచిపోయినట్లుగా ఆయన తయారైపోయారు. ఈ క్రమంలోనే మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యనాయుడుకు ఓటేసేందుకు ఆరోగ్యం సహకరించకున్నా... ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి మరీ దేవేందర్ ఓటేసి వచ్చారు. అయితే అప్పుడు ఆయన కెమెరా కంటికి చిక్కలేదు గానీ... నేటి ఉదయం భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసేందుకు బయటకు వచ్చిన ఆయన... ఈ సారి మాత్రం మీడియా కంటికి దొరికిపోయారు. ఈ సారి ఆయన రూపం చూసి కెమెరామెన్లే షాకయ్యారట.
గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఎలా బక్క పలుచగా ఉన్నారో... ఇప్పుడు కూడా అదే రీతిన కనిపించారట. అంతేకాదండోయ్... గతంలో బక్క పలుచగా ఉన్నా యమా యాక్టివ్ గా ఉన్న దేవేందర్... ఈ దఫా మాత్రం చాలా బలహీనంగా - కళావిహీనమైన మోముతో కనిపించారట. ఓ వైపు వయసు మీద పడుతుండటం, మరోవైపు అనారోగ్య సమస్యలు చుట్టుముడితే... ఒక్క దేవేందర్ గౌడ్ ఏమిటీ? ఎవరిదైనా ఇదే పరిస్థితి అన్న మాట వినిపిస్తోంది. అయినా దేవేందర్ గౌడ్ ను సతమతం చేసిన వ్యాధి ఏమిటనేగా మీ ప్రశ?. చాలా కాలం క్రితమే దేవేందర్‌కు కేన్సర్ సోకిందట. ఈ క్రమంలోనే చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన ఆయన ఇటీవలే తిరిగి వచ్చారట.