Begin typing your search above and press return to search.
ఫాంహౌస్ లో కేసీఆర్ ఏం చేస్తారో తెలుసా? ఆ మాజీ సీఎం నిప్పులు
By: Tupaki Desk | 5 Sep 2021 8:30 AM GMTఓపక్క ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. గడిచిన మూడు రోజులుగా ఎంత బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఓపక్క పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన ఆయన.. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో పాటు కేంద్రమంత్రుల్ని కలిసి.. పెద్ద ఎత్తున వినతిపత్రాలు ఇస్తూ ఉన్న వేళలో.. ఆయనకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో మరో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నిప్పులు చెరిగిన తీరు ఆసక్తికరంగా మారింది. ఓవైపు తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తుంటే.. అవేమీ పట్టనట్లుగా ఢిల్లీలో తన పని తాను చేసుకుంటూ పోతున్న కేసీఆర్ అండ్ కోకు చురుకుపుట్టేలా.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి.
వాస్తవానికి తెలంగాణలో బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా పాదయాత్ర నిర్వహిస్తున్న వేళలో.. కేసీఆర్ ప్రదాని.. కేంద్రమంత్రుల్ని కలవటం.. పార్టీకి నష్టం కలిగే పరిణామాలుగా అభివర్ణిస్తున్నారు. ఓపక్క కేసీఆర్ మీద తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు నిప్పులు చెరుుతున్న వేళ.. అందుకు భిన్నంగా సాదరంగా ఆహ్వానించిన వైనంపై కమలనాథులు గుర్రుగా ఉన్నారు. పొలిటికల్ మైలేజీ తప్పించి.. మరింకేమీ పట్టని కేసీఆర్ కు.. తాజా పర్యటనలో ప్రధాని.. అమిత్ షాలు అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే బాగుండేదన్న మాట వినిపిస్తోంది.
బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నిప్పులు చెరిగారు. తాజా యాత్ర తెలంగాణలో రాజకీయ మార్పును తీసుకొస్తుందన్నారు. ఈ సందర్భంగా ఫామ్ హౌస్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తారో చెబుతూ.. 'కేవలం తన కుటుంబం కోసం మాత్రమే కేసీఆర్ ఆలోచిస్తారు. కేసీఆర్ ఫాంహౌజ్ లో కూర్చొని మాట్లాడితే.. బండి సంజయ్ మాత్రం రైతుల మధ్య కూర్చొని మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎప్పుడైనా రైతులతో కూర్చున్నారా? మీరే ఆలోచించండి. ఫాంహౌస్ లో కూర్చొని పథకాలు రచించి.. ఏ విధంగా దోపిడీ చేయాలా? అని ఆలోచిస్తుంటారన్నారు.
'కేసీఆర్ ఇప్పుడు అనేక సబ్సిడీలను నిలిపివేశారు. ధరణిని అమలు చేయటం లేదు. రుణమాఫీని పూర్తిగా ఇవ్వటం లేదు. రైతుల సర్కార్.. ప్రజాస్వామిక సర్కార్ రావాలంటే బండి సంజయ్ పాదయాత్రను ఆశీర్వదించాలన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు.. సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులు పంట గిట్టుబాక కాకపోవటంతో నష్టపోతుంటే.. కేసీఆర్ మాత్రం ఏకరానికి కోటి రూపాయిలు సంపాదిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. 'గంజాయి గిట్ల పండిస్తున్నడేమో?' అని తీవ్ర ఆరోపణ చేశారు. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి.. మిగిలిన అన్ని సబ్సిడీలను బంద్ చేశాడన్నారు.
''అద్బుతాలు సృష్టిస్తానన్నాడు. కానీ స్ప్రింకర్ల సబ్సిడీ, పాలీహౌజ్ సబ్సిడీ, విత్తనాల సబ్సిడీ బంద్ చేసిండు. చివరకు రుణమాఫీ చేస్తనన్నడు. బ్యాంకులో వేసుకున్న సొమ్మును కూడా బ్యాంకు వాళ్లు లాక్కుంటున్నారు. రైతులు హరిగోస పడుతున్నారు. కేసీఆర్కు వందలాది ఎకరాల ఫాంహౌజ్ ఉంది. ఆయన ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తుండట. మరి ఏం పండిస్తుండో? ఆయన ఫాంహౌజ్లో సాయిల్ టెస్ట్ చేసుకుంటడు. దొడ్డు వడ్లు పండిస్తడు. కానీ రైతులు మాత్రం సన్న వడ్లు పండించాలని చెప్తడు. పండించిన పంటను మీ బావుల దగ్గరే కొని మీ ఇంటికే డబ్బులు పంపిస్తామని చెప్పిన కేసీఆర్ అవేమీ చేయలేదు. రైతులు ధాన్యం అమ్ముకోలేక, కొనుగోలు కేంద్రాలవద్ద పడిగాపులు పడి నానా గోస పడుతున్నరు' అంటూ బండి సంజయ్ విరుచుకుపడ్డారు.