Begin typing your search above and press return to search.
హజారే ఊళ్లో ఫడ్నవీస్‌కు షాక్ తగిలిందే!
By: Tupaki Desk | 4 Nov 2017 10:11 AM GMTబీజేపీలో మిస్టర్ క్లీన్‌గా పేరుగాంచిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు... అవినీతిపై సమర శంఖం పూరించిన సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే సొంత గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసే దాకా ఫడ్నవీస్ పేరు ఎక్కడా వినిపించిన దాఖలా లేదు. అందరి లాగే ఫడ్నవీస్ కూడా బీజేపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించిన ఓ నేత మాత్రమే. అయితే గడచిన ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి బీజేపీ- శివసేన కూటమి అధికారం చేజిక్కించుకోవడంతో అసలు సీఎం అభ్యర్థిగా ఎవరిని నియమించాలన్న ప్రశ్న ఎదురైంది. బీజేపీలో ఆ స్థాయి నేతలు ఎవరూ లేరని వాదించిన శివసేన... తనకే సీఎం సీటును కేటాయించాలని డిమాండ్ చేసిన వైనం కూడా మనకు తెలిసిందే. అయితే సుదీర్ఘ మంతనాల తర్వాత సీఎం సీటును బీజేపీ తనవైపునే నిపుకుని యువనేతగానే కాకుండా మిస్టర్ క్లీన్ ఇమేజీ ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌ను మహా సీఎం పోస్టుకు ఎంపిక చేసింది.
పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు సీఎం పదవి చేపట్టిన ఫడ్నవీస్ తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. మహారాష్ట్రలో పలు కీలక సంస్కరణలకు ఆయన శ్రీకారం చుడుతున్నారు. అయితే సాగు నీటి కొరత నేపథ్యంలో అక్కడ రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. సాగు నీటికే కాకుండా తాగు నీటికి కూడా అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఉన్న సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూ... సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరించుకుంటూ ఫడ్నవీస్ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఫడ్నవీస్ పాలనపై మరాఠాల్లో పెద్దగా వ్యతిరేకత ఏమీ లేదు. ఎందుకంటే... అధికారాన్ని అడ్డుపెట్టుకుని మిగిలిన సీఎంల మాదిరిగా ఫడ్నవీస్ అక్రమ సంపాదనకు దిగ లేదు. అవినీతిని ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఇదంతా బాగానే ఉన్నా... అవినీతికి అంతం పలకాలంటూ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టి కేంద్ర ప్రభుత్వాలను బెంబేలెత్తించిన సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే గుర్తున్నారు కదా. మహారాష్ట్రకే చెందిన హజారే... తన సొంతూరు రాలేగావ్ సిద్ధి కేంద్రంగా ఉద్యమాలకు రూపకల్పన చేస్తుంటారు.
ఫడ్నవీస్ లాంటి సీఎం ఆ ప్రాంతానికి వెళితే... నిజంగానే హారతి పడతారని మనమంతా అనుకుంటాం. ఎందుకంటే... అవినీతి అంతానికి హజారే పోరాడుతుంటే... పోరాటాలకు దూరంగా ఉంటూనే ఫడ్నవీస్ అవినీతి భరతం పడుతున్నారు. అయితే నేటి ఉదయం రాలేగావ్ సిద్ధికి వెళ్లిన ఫడ్నవీస్‌కు హారతికి బదులుగా పెద్ద చేదు అనుభవమే ఎదురైంది. రాలేగావ్ సిద్ధిలో నేటి ఉదయం ఓ కార్యక్రమానికి హాజరైన ఫడ్నవీస్‌పై ఇంకు చల్లేందుకు ఓ యువకుడు విశ్వయత్నం చేశాడు. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ఆ యువకుడు తెచ్చిన ఇంకు ఫడ్నవీస్‌పై పడలేదు. రాలేగావ్ సిద్ధీలో ఓ శంకుస్థాపన క్యార్యక్రమానికి ఫడ్నవిస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ యువకుడు ఆయనకు అత్యంత దగ్గరగా వచ్చేందుకు యత్నించాడు. అది గమనించిన భద్రతా సిబ్బంది అతన్ని నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఇంక్ బాటిల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతనెవరు? ఆ పని ఎందుకు చేయాలనుకున్నాడన్న విషయాలు తెలియరాలేదు.