Begin typing your search above and press return to search.
ఇంట్లో పూజకు పిలిచి ఇష్యూలో ఇరుక్కున్న సీఎం
By: Tupaki Desk | 12 Sep 2016 6:42 AM GMTఅత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచితీసుకోవాలి. అస్సలు తొందరపడకూడదు. ఈ మధ్యన కొందరు ముఖ్యమంత్రులు నాటకీయతకు ప్రాధాన్యం ఇచ్చి మైలేజీ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఎదురుదెబ్బలు తినేలా చేస్తున్నాయి. మిగిలిన ముఖ్యమంత్రులకు కాస్తభిన్నంగా వ్యవహరించే అలవాటు ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవిస్ తాజాగా నాటకీయకు ప్రాధాన్యమిచ్చి తాజాగా చిక్కుల్లో చిక్కుకుపోయారు.
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా మహదేవ్ వాడి గ్రామానికి చెందిన హెవలేకర్దంపతులు గత బుధవారం వినాయకుడి విగ్రహంతో సచివాలయం గేటు వద్దకువచ్చి ఆందోళనకు దిగారు. ఎందుకిలా అంటే.. తనను తన గ్రామంలో సాంఘికంగా వెలి వేశారని.. గణేశ్ ఉత్సవాల్లో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని చెప్పి హడావుడి చేశారు. దీంతో స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవిస్.. ఆ దంపతుల్ని వినాయకచవితి రోజు తన నివాసానికి ఆ దంపతుల్నిఆహ్వానించారు. తమతో కలిసి ఆయన వారిని గణేశ్ పూజల్లో పాల్గొనేలా చేశారు.
దీనికి సంబంధించిన ఫోటోలు మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.మంచి కోసం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదంగా మారింది. గ్రామస్తులు సాంఘిక బహిష్కరణ చేసినట్లుగా చెప్పిన ఇతగాడి హిస్టరీ చూస్తే.. 2013లో ఒక మహిళపై లైంగికంగా వేధించిన కేసు నమోదు అయి ఉంది. 2014లో స్థానిక కోర్టులో ఆయనపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయటంఉంది. ఈ కేసు విచారణకు హాజరు కాకపోవటంతో ఇతనిపై కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి కూడా ఉంది.
ఇలాంటి ‘ఘన చరిత్ర’ ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రి తన ఇంటికి గణేశ్ పూజ కుస్వయంగా పిలవటమే కాదు.. తన పక్కనే పూజ చేయించటం ఇప్పుడువివాదంగా మారింది. తాజాగా ఇతడి హిస్టరీ బయటకు రావటంతో అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం బెయిల్ మీద విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లోముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు ఎదురైన చిక్కేమింటంటే.. తన ఇంటికి పూజకు ఆహ్వానించే క్రమంలో అతడి ముందు వెనుకా ఆరా తీయకుండా పిలిచేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి దగ్గరకు ఒకరిని పంపే ముందు.. అతడి చరిత్రపై నిఘా వర్గాలు ఎంతోకొంత దృష్టి పెట్టాలి కదా?మరి.. నిఘా వర్గాలు ఏం చేస్తున్నట్లు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.