Begin typing your search above and press return to search.
మోడీ కి నో చెప్పిన బీజేపీ సీఎం !
By: Tupaki Desk | 18 March 2017 6:50 AM GMTరక్షణ మంత్రి పదవి తొలగించి మరీ మనోహర్ పారికర్‌ను గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేలా చేసినట్లే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను సైతం కేంద్ర మంత్రి వర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకుంటారు అంటూ కొద్దిరోజులు ఊహగానాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఫడ్నవీస్ కొట్టిపారేశారు. ఇండియాటుడే నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ లోకి వెళ్ళే అవకాశాలను తోసిపుచ్చారు. బీజేపీలో తాను నిజమైన సైనికుడినని పేర్కొన్నారు. సీఎం కన్నా కేంద్ర మంత్రికి ఎక్కువ అవకాశాలుంటాయని తాను అనుకోవడం లేదని ఫడ్నవీస్ అన్నారు. తామే పాత్ర పోషించినా తమ ముందు పెద్ద లక్ష్యాలున్నాయని, తాము ఏ పదవిలో ఉన్నామన్నది ప్రధానం కాదని ఫడ్నవీస్ విశ్లేషించారు.
ఇదిలాఉండగా....గోవాలో తమ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి పారికర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గిన నేపథ్యంలో పారికర్ విలేకరులతో మాట్లాడారు. ‘మీ ప్రభుత్వం ఐదేళ్లూ అధికారంలో ఉంటుందా? అని అడుగుతున్నారు. దీనికి నా సమాధానం ఒక్కటే. మా ప్రభుత్వం పూర్తికాలం అంటే ఐదేళ్లూ అధికారంలో ఉంటుంది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు’అని పారికర్ చెప్పారు. మిత్రపక్షాలతో కలిసి కామన్ అజెండా అమలుకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. 61 ఏళ్ల ఐఐటియన్ అయిన పారికర్ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకున్నారు. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు గోవా ఫార్వర్డ్ పార్టీ, ముగ్గురు మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, ముగ్గురు ఇండిపెండెంట్లు, ఎన్‌సీపీ సభ్యుడొకరు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. కాంగ్రెస్ సభ్యులు 16 మందిలో ఒకరు సమావేశానికి హాజరుకాలేదు. విశ్వజిత్ రాణే అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే సభ్వత్వానికి రాజీనామా చేశారు.
గోవా ముఖ్యమంత్రిగా పారికర్ నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందెప్పుడూ ఆయన ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో లేదు. ఇటీవలే రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కాగా పారికర్ కేబినెట్ సహచరులతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈనెల 23న కొత్త అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ మృదులా సిన్హా ప్రసంగించనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/