Begin typing your search above and press return to search.
సీఎం ఫారిన్ వెళ్తే, అంతా భార్య ఆధ్వర్యంలోనే..
By: Tupaki Desk | 10 Sep 2015 9:59 AM GMTకంగారు అక్కర్లేదులెండి.. ఈ వ్యవహారం ప్రస్తుతం ఫారిన్ లో ఉన్న తెలంగాణ సీఎం కుటుంబం గురించి గానీ, ఏపీ సీఎం గురించి గానీ కాదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురించి. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సారథ్యంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించదలచుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం.. తీరా దాన్ని నిర్వహించవలిన సమయానికి ఆయన జపాన్ పర్యటనకు వెళ్లవలసిన అవసరం ఏర్పడేసరికి... ప్రత్యామ్నాయం ఆయన భార్య అమృత ఆధ్వర్యంలోనే నిర్వహించడానికి సిద్ధం చేసుకుంటున్నారు.
ఇంతకూ ఏమిటా కార్యక్రమం... భార్య ఆధ్వర్యంలో ఎలా జరగబోతోంది అనుకుంటున్నారు కదా. వివరాల్లోకి వెళితే... గోదావరి పుష్కరాలు మనం నిర్వహించేశాం. అయిపోయిది. అయితే అదే గోదావరి జన్మస్థలం అయిన నాసిక్ లో ఈ ఏడాది మహా కుంభమేళా జరగబోతోంది. కుంభమేళాలో నిర్వహించే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం కైలాష్ మానస సరోవరం నుంచి పవిత్ర జలాలను తీసుకు రావాల్సి ఉంది. ఈనెల 12-17 తేదీల్లో మానససరోవర్ యాత్రకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం వివిధ రంగాల్లో అత్యద్భుత ప్రతిభావంతులైన 13 మంది నిపుణులను ఒక బృందంగా ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సారథ్యంలో ఈ బృందం అక్కడకు వెళ్లాలి.
అయితే అదే సమయంలో ఫడ్నవీస్ జపాన్ టూర్ ఖరారు కావడంతో పరిస్థితి మారింది. బృందంలో ఆయన బదులుగా భార్య అమృత వెళ్తున్నారు. ఆమెతో పాటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోం మంత్రి రాం షిండే కూడా ఉంటారు. చైనా కౌన్సిల్ జనరల్, ముంబాయిలోని అబ్జర్వర్ రిసర్చి ఫౌండేషన్ వారు దీన్ని నిర్వహిస్తున్నారు. ఇలాంటి సాంస్కృతి దౌత్యం ఇరుదేశాల సంబంధాలకు మేలు చేస్తుందని అంతా అనుకుంటున్నారు. మొత్తానికి సీఎంకు ఫారిన్ టూరు పడితే.. అక్కడ భార్య ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగిపోతోంది. మన రాష్ట్రాల్లో అయితే పరిస్థితి వేరు కదా!!