Begin typing your search above and press return to search.
న్యూయార్క్ ఫ్యాషన్ షోలో సీఎం సతీమణి!
By: Tupaki Desk | 7 Sep 2016 7:10 AM GMTసాదారణంగా ఫ్యాషన్ షో అంటే ఎవరు పాల్గొంటారు? మోడల్స్ పాల్గొంటారు, అప్పుడప్పుడు క్రీడాకారులు, సినిమా యాక్టర్లు పాల్గొని హల్ చల్ చేస్తుంటారు. అసలు ఫ్యాషన్ షో అంటే ఎలా గుంటుంది? చెప్పేదేముంది.. అలాగే ఉంటుంది. పైగా న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ అయితే.. ప్రత్యేకంగా ఏమాత్రం చెప్పనవసరంలేదు. రకరకాల అందాలతో వీక్షకులకు వీనుల విందే దొరుకుతుంది. అయితే ఈ ఫ్యాషన్ వీక్ ర్యాంప్ పై తాజాగా ఒక ముఖ్యమంత్రి భార్య కనిపించనున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్ న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పై కనిపించనున్నారు. పుణెకు చెందిన ఓ డిజైనింగ్ ఇన్ స్టిట్యూట్ తరఫున ఆమె షోస్టాపర్ గా కనిపించి కనువిందు చేయనున్నారు. చేనేత వస్త్రాలతోపాటు, బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఆమె ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇదే క్రమంలో యువ డిజైనర్ల ప్రతిభను చాటేందుకు పుణెకు చెందిన ఛేసా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ టెక్నాలజీ సంస్థ ఈ ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నది.
ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన అమృత ఫడ్నవీస్... బాలికల విద్యను ప్రోత్సహించాలన్న సందేశంతోనే తాను ర్యాంప్ పై నడవబోతున్నానని.. రైతులు, రైతు కూలీల పిల్లలు రూపొందించిన ఈ చేనేత వస్త్రాలను, వారి ప్రతిభను లోకానికి చాటే ఈ కార్యక్రమం వినూత్నమైనదని, తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. గతంలో గిరిజన కళలతో కూడిన చేనేత వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ చేసిన ఆమె.. ఈసారి యువ డిజైనర్లను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ ఇవెంట్ లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో ఇండో వెస్ట్రన్ స్టైల్లో రూపొందించిన ఓ విశిష్టమైన చేనేత వస్త్రాన్ని ధరించి అమృత ర్యాంప్ మీద కనిపించనున్నారు.