Begin typing your search above and press return to search.
దేవేందర్‌గౌడ్ తెదేపాకు దూరం అవుతున్నారా?
By: Tupaki Desk | 7 Sep 2015 4:52 AM GMTతెలుగుదేశం పార్టీలో ఒకప్పట్లో నెంబర్ టూగా అత్యున్నతస్థాయిలో అధికారం చెలాయించిన తెలంగాణ నాయకుడు దేవేందర్ గౌడ్! చంద్రబాబు నేతృత్వంలో పార్టీ తొమ్మిదేళ్ల పాలన వైభవాన్ని సాగించినప్పుడు ఆయన మాటంటే తిరుగులేని విధంగానే సాగింది. రకరకాల మలుపుల తర్వాత ఆయన ఇప్పుడు తెదేపాలోనే ఉంటూ.. పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా హోదాను అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఆయన తన పార్టీకోసం ఏమైనా చేస్తున్నారా అంటే మాత్రం ఎవ్వరి వద్దా సమాధానం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో దేవేందర్ గౌడ్ పాల్గొనగా, పార్టీ వేదిక మీదనుంచి మాట్లాడగా, పార్టీ తరఫున వైరిపక్షాల్ని విమర్శించగా చూసి.. ఏడాదికి పైగానే గడుస్తోంది. ఆయన తెదేపాకు దూరం కాదలచుకున్నారా అనే అనుమానం రాజకీయ వర్గాల్లో వ్యాపిస్తోంది.
గౌడ్ ఒకప్పట్లో పార్టీలో నెంబర్ టూ అనడంలో సందేహం లేదు. పార్టీ ఓడిపోయి, కాంగ్రెస్ పాలన మొదలయ్యాక.. తెలంగాణలో తన అస్తిత్వం కాపాడుకునే ఉద్దేశంతో గౌడ్ బయటకు వచ్చి, సొంత కుంపటి పెట్టుకున్నారు. అది కాస్తా దారుణంగా దెబ్బతింది. తిరిగి తెదేపా పంచన చేరారు. తన అవసరానికి బయటకు వెళ్లిపోయి, గతిలేక తిరిగివచ్చారనే చిన్నచూపు లేకుండా చంద్రబాబు ఆయనను మళ్లీ నెత్తినే పెట్టుకున్నారు. ఆయనకు రాజ్యసభ ఎంపీగా పదవిని కట్టబెట్టారు. ఆయన కొడుకుకు గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. ఎంతో పోటీ ఉన్నప్పటికీ.. టిక్కెట్ దేవేందర్ కొడుక్కు దక్కింది. ఇన్ని చేసినా.. ఆయన తరఫునుంచి పార్టీకి బహిరంగంగా ఏమీ మేలు ఉండడం లేదు.
నిజం చెప్పాలంటే తెలంగాణలో పార్టీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రేవంత్ రెడ్డి కూడా అరెస్టు అయి, ప్రస్తుతం కొడంగల్ కు పరిమితం అయ్యాక, కొందరు నాయకులు పార్టీ మారిపోయిన తర్వాత.. తెలంగాణలో తెలుగుదేశం గళాన్ని వినిపించడానికి సత్తా ఉన్న తెదేపా నాయకులు కరవయ్యారు. ఒకరిద్దరు మాత్రమే నిత్యం అందుబాటులో ఉండగా.. వారి మాటలకు ప్రజల్లో మొహం మొత్తుతోంది. అంతా స్థాయిలేని చిన్న నాయకులే మిగిలారు.
అయితే దేవేందర్ గౌడ్.. అనారోగ్యం వల్ల పార్టీ పనుల్లో పాల్గొనలేకపోతున్నారనే అభిప్రాయం చాన్నాళ్ల వరకూ అందరికీ ఉండేది. అయితే తాజాగా ఆయన బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఒక కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. అంత చురుగ్గా ఉన్న నాయకుడు, పార్టీ కోసం సమయం కేటాయించకపోవడం దారుణం అని పలువురు భావిస్తున్నారు. ఇలాంటి పరిణామాలు జరుగుతుండడం వల్లనే దేవేందర్ తెదేపాకు దూరం జరుగుతున్నారనే పుకార్లు పుడుతున్నాయి.