Begin typing your search above and press return to search.

మారణ హోమం చేసినోడిని గుర్తించడమే.. ఆమె చేసిన పాపమా !

By:  Tupaki Desk   |   16 Sep 2020 11:30 PM GMT
మారణ హోమం చేసినోడిని గుర్తించడమే.. ఆమె చేసిన పాపమా !
X
ముంబైలో మారణకాండను సృష్టించిన కరడుగట్టిన టెర్రరిస్ట్​ కసబ్​ను జడ్జి ఎదుట గుర్తించి అతడిని ఉరికంబం ఎక్కడానికి కారకురాలైన చిన్నారి ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. అప్పట్లో ఆమెను ఆకాశానికి ఎత్తేసిన మీడియా, దేశభక్తులు ప్రస్తుతం పత్తాలేకుండా పోయారు. చిన్న ఇంట్లో బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్న ఆ చిన్నారిని ప్రస్తుతం పట్టించుకొనేవారు కరువయ్యారు. అది 2008 వ సంవత్సరం. ముంబైలోని వెస్ట్​ వాంద్రాకు చెందిన ఓ వ్యక్తి తన తొమ్మిదేళ్ల కూతురు దేవికను తీసుకొని ఫుణే వెళ్లేందుకు చత్రపతి శివాజి టెర్మినస్​కు వెళ్లాడు. సరిగ్గా ఆ సమయంలో ఉగ్రవాద మూక రెచ్చిపోయింది. కసబ్​ అతడి అనుచరులు అక్కడి జనాల మీద విక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో మొత్తం 58 మంది మృతిచెందారు. ఉగ్రవాదులు కాల్చిన తూటా దేవి కాలులోకి దూసుకొని వెళ్లింది. దీంతో ఆ చిన్నారి స్పృహకోల్పోయింది. అనంతరం పోలీసులు కసబ్​ను ప్రాణాలతో పట్టుకున్నారు. కానీ ఆ దర్మార్గుడిని కళ్లారా చూసి.. బతికి బట్టగట్టింది ఒక్క దేవిక మాత్రమే. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులకు కసబ్​ను గుర్తించగల బాలిక ఒక్క దేవిక మాత్రమేనని తెలిసింది. దీంతో పోలీసులు ఆ చిన్నారిని ముంబైలోని ఆర్థర్​ జైలుకు తీసుకొచ్చారు. జడ్జి ఎదుట విచారణ చేపట్టగా చిన్నారి ఆ కరుడుగట్టిన నేరస్థుడిని గుర్తించింది. ఇక కొద్దిసేపటికే టీవీ చానళ్లలు బ్రేకింగ్​ న్యూస్​లతో హోరెత్తాయి.

చిన్నారి దేవిక పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆమెకు గొప్ప జ్ఞాపకశక్తి ఉందని కొందరు.. ఆమె చిన్నారి రూపంలో ఉన్న అపరకాళిక అని వెన్నోళ్ల పొగిడారంతా.. కట్​చేస్తే దేవిక ఇప్పుడు డిగ్రీలోకి వచ్చింది. తన కుటుంబపరిస్థితి ఏమాత్రం మారలేదు. ఐపీఎస్​ కావలన్న తన కల నెరవేరలేదు. తాను ఇప్పడు అదే మురికివాడలో బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నది. కసబ్​ అనుచరులమంటూ పలుమార్లు కొందరు దుండగలు ఆ చిన్నారిని బెదిరించారు. కసబ్​ను గుర్తించిన ఈ పిల్లతో మాట్లాడితే మనకు ముప్పు ఉంటుందని భావించి చుట్టాలు మాట్లాడటం లేదు. చట్టుపక్కల వాళ్లు ఆ కుటుంబాన్ని దూరం పెట్టారు. ఇక కొన్ని పాఠశాలలు అయితే దేవికకు సీటు ఇవ్వబోమని తేల్చిచెప్పాయి. దీంతో ఎలాగోలాగ చదివి డిగ్రీలోకి వచ్చింది. ఇప్పడాఅమ్మాయి తన కుటుంబాన్ని కొంచెం పట్టించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నది.