Begin typing your search above and press return to search.
ఈ మేడమ్ మందుల స్కాం..జస్ట్ పది కోట్లే....
By: Tupaki Desk | 28 Sep 2019 4:43 AM GMTహైదరాబాద్ లో సంచలన స్కాం వెలుగులోకి వచ్చింది. మందులోళ్లు.. మాయలోళ్లయి.. చేసిన అక్రమాల పుట్టను ఏసీబీ బద్దలు కొట్టింది ఏకంగా ఐఎంఎస్ డైరెక్టర్ - జాయింట్ డైరెక్టర్ భాగస్వాములైన ఈ కుంభకోణంలో పలువురు కిందిస్థాయి సిబ్బంది హస్తం ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. ఏక కాలంలో 23చోట్ల సోదాలు నిర్వహించారు. మందుల స్కాం కేసులో ఈ ఎస్ ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు ఆమె కొడుకును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. షేక్ పేట్ లోని తన నివాసం నుండి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
కార్మికులు - దిగువ శ్రేణి ఉద్యోగులకు సేవలు అందించే ఈఎస్ ఐ దవాఖానలకు - డిస్పెన్సరీలకు మందులు కొనుగోలు చేసి సరఫరా చేసే సంస్థ ఐఎంఎస్ (ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్) డైరెక్టరేట్ లో భారీ కుంభకోణం బయటపడింది. ఏసీబీ అధికారుల ప్రకటన ప్రకారం.. ఇప్పటి వరకు రూ.11,69,12,485 మేర అక్రమాలు వెలుగుచూశాయి. మందుల కొనుగోళ్లలో ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ దేవికారాణి - జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కే పద్మ సూత్రధారులుగా సాగిన ఈ అవినీతి డొంకను ఏసీబీ కదిపింది. పక్కా ఆధారాలతో గురువారం ఉదయం నుంచి ఏకకాలంలో 23చోట్ల నిర్వహిస్తున్న సోదాల్లో పలు కీలకపత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది.
దేవికారాణి కుమారుడి సంస్థ పేరుతో మెడిసిన్ కొన్నట్టు ఫేక్ బిల్స్ సృష్టించినట్టు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఈ కేసులో 17 మంది ఉద్యోగులు - నలుగురు ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. 10 కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు ఏసీబీ అధికారులు తేల్చారు.
ESI మందుల స్కాంలో ఇప్పటివరకు పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.
డాక్టర్ దేవికారాణి - హైదరాబాద్ ESI డైరెక్టర్
డాక్టర్ కె.పద్మ - వరంగల్ ఈఎస్ ఐ జాయింట్ డైరెక్టర్
డాక్టర్ కె.వసంత ఇందిర - హైరాబాద్ ఈఎస్ ఐ - అసిస్టెంట్ డైరెక్టర్ –స్టోర్స్
ఎం.రాధిక - శంషాబాద్ ఈఎస్ ఐ డిస్పెన్సరీ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్
సీహెచ్.శివనాగరాజు - హైదరాబాద్ ఓమ్నీ మెడికల్ ప్రతినిధి
వి.హర్షవర్ధన్ - హైదరాబాద్ ఈఎస్ ఐ RFDD సెక్షన్ సీనియర్ అసిస్టెంట్
కె.శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ - హైదరాబాద్ ఓమ్నీ మెడికల్ ఎండీ
కాగా, ESI మందుల కొనుగోళ్ల అక్రమాల కేసులో ఏడుగురు నిందితులకు అక్టోబర్ 11వరకు హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. స్కామ్ దర్యాప్తులో భాగంగా… మొత్తం ఏడుగురు నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని… అందుకోసం వారిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ESI డైరెక్టర్ దేవికారాణి.. మరో ఆరుగురిని 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించింది.