Begin typing your search above and press return to search.
దేవినేని నెహ్రూ కుమారుడి ఫ్యూచర్ ఏంటో?
By: Tupaki Desk | 24 April 2017 1:20 PM GMTమాజీ మంత్రి, సీనియర్ నాయకుడు దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ రాజకీయ భవిష్యత్‌పై ఆయన సన్నిహితుల్లో కొత్త చర్చ మొదలైంది. ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో కొద్దికాలం వీరిద్దరూ టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే నెహ్రూ కన్నుమూసిన నేపథ్యంలో ఆయన కుమారుడు అవినాష్ కు తెలుగుదేశం పార్టీలో భవిష్యత్ ఏ విధంగా ఉంటుందనే చర్చ మొదలైంది. మునపటి ప్రాధాన్యమే నెహ్రూ కుమారుడికి దక్కుతుందా అనే చర్చ తెరమీదకు వస్తోంది.
అవినాష్ రాజకీయ భవిష్యత్ కోణంలోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కేందుకు నెహ్రూ నిర్ణయం తీసుకున్నారు. అయితే నెహ్రూ మరణంతో గతంలో దక్కిన అంత ప్రాధాన్యం ఇప్పుడు టీడీపీలో అవినాష్‌కు దక్కుతుందా అనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. దేవినేని నెహ్రూ తెలుగుదేశంలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు కారణమైన మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఇప్పుడు నెహ్రూ తనయుడి విషయంలో పూర్వపు శ్రద్ధ చూపుతారా అనే సందేహం తెరమీదకు రావడం ఆసక్తికరం. నెహ్రూ కంటే ముందే ఆయన సోదరుడు బాచి ప్రసాద్, ఆయన తనయుడు టీడీపీలో చేరడం కూడా మరో అంశంగా చెప్తున్నారు.
కాగా, 1983లో తెలుగుదేశం ఆవిర్భావ సమావేశంలోనే పార్టీలో చేరి రాజకీయ ఆరంగ్రేటం చేసిన నెహ్రూ కంకిపాడు నుంచి టీడీపీ తరఫున 1983 - 85 - 89 - 94 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. తెలుగుదేశంలో చీలిక ఏర్పడినపుడు ఎన్టీఆర్ పక్షాన నిలువటమేగాక లక్ష్మీ పార్వతి నాయకత్వంలో పనిచేస్తూ 1998 పార్లమెంటు ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో తిరిగి పోటీచేసి మరోమారు ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ కు భవష్యత్ లేకపోవడంతో తిరిగి టీడీపీ గూటికి వచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/