Begin typing your search above and press return to search.
ఎన్నికల వేళ టీడీపీకి - దేవినేనికి షాక్
By: Tupaki Desk | 11 March 2019 6:28 AM GMTఎన్నికల వేళ టీడీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సోదరుడు దేవినేని చంద్రశేఖర్ సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు.
హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ సమక్షంలో వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి దేవినేని చంద్రశేఖర్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడారు. అనేక రకాల కారణాల వల్ల తాను పార్టీ మారాల్సి వచ్చిందని వివరించారు. అధికార పార్టీలో దోపిడీ ఎక్కువైందని.. పట్టిసీమ ఇరిగేషన్ లాంటి ప్రాజెక్టుల్లో దోపిడీ విచ్చలవిడిగా సాగిందని ఆరోపించారు. ఈ కేసుల నుంచి టీడీపీ నేతలు బయటపడలేరని వ్యాఖ్యానించారు.
ఇక వైసీపీలో చేరిన మరో నేత వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ‘రావణుడి లంక నుంచి విభీషణుడు బయటకు వచ్చినట్లు దేవినేని ఉమ నుంచి దేవినేని చంద్రశేఖర్ బయటకు వచ్చారు’ అని వ్యాఖ్యానించారు. దేవినేని చంద్రశేఖర్, తాను ఈ ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంత్రి దేవినేని ఉమ తమను అణగదొక్కాలని చూశాడని.. కానీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఇక మంత్రి ఆటలు సాగవని స్పష్టం చేశారు.