Begin typing your search above and press return to search.
టీడీపీలో మరో దేవినేని?
By: Tupaki Desk | 3 Aug 2016 6:06 AM GMTఎంత కాదనుకున్నా అధికార పార్టీ అధికార పార్టీయే.. చేతిలో అధికారం లేకపోయినా అధికార పార్టీలో ఉంటే కొంత బలం వచ్చేస్తుంది. అందుకే కొందరు నేతలు తెలివిగా ఎప్పుడూ అధికార పక్షంలోనే ఉంటారు. ఇంకొందరు మాత్రం తమతమ పార్టీలను విడవకుండా కంటిన్యూ అవుతుంటారు. అయితే... ప్రస్తుతం అలా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు ఏమీ లేకున్నా అదే పార్టీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తాము పెద్ద పదవుల్లో లేకపోయినా పార్టీ అధికారంలో ఉండడ్ంతో హవా చలాయించిన ఆ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతినేయడంతో ఆలోచనలో పడుతున్నారు. టీడీపీలోకి రాలేక వైసీపీలోకి వెళ్లాలని అనుకున్నా అక్కడున్నా కాంగ్రెస్ లో ఉన్నా ఒకటేనన్న ఫీలింగులో ఉంటున్నారు. దీంతో జనం ఏమనుకుంటే అది అనుకోనీ అనుకుంటూ అధికార పార్టీ టీడీపీలో చేరడానికే సిద్ధమవుతున్నారు. విజయవాడలో ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్సు - పబ్లిక్ గాసిప్సులో నలుగుతున్న అంశమిది.. ఇంతకీ ఈ పార్టీ మార్పు ఎవరి గురించో తెలుసా...? దేవినేని నెహ్రూ గురించి. కాంగ్రెస్ పార్టీకి చెందిన త్వరలో టీడీపీలో చేరుతారని టాక్. ఆయనే కాదు.. కృష్ణా జిల్లాకే చెందిన మరో సీనియర్ లీడర్ బూరగడ్డ వేదవ్యాస్ కూడా టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
పవర్ లో లేకున్నా పవర్ ఫుల్ నేతగా ఉన్న దేవినేని నెహ్రూ టీడీపీ వైపు చూస్తున్న విషయం వాస్తవమేనని ఆయన అనుచరులు చెబుతున్నారు. గతంలో టీడీపీలోనే ఉన్న ఆయన పార్టీ చీలిక నేపథ్యంలో ఎన్టీఆర్ తరఫున నిలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిపోయారు. నాటి నుంచి ఆయన అదే పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రాభవం కొడిగడుతుండటం నెహ్రూను డైలమాలో పడేసింది. ఈ నేపథ్యంలో తన పాత గూటికి చేరేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారట. ఇక అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ రాజకీయవేత్త - కాంగ్రెస్ పార్టీకే చెందిన బూరగడ్డ వేదవ్యాస్ కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓసారి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన వేదవ్యాస్ రెండు రాష్ట్రాల ప్రజలకు చిరపరచితులే. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో కొద్దికాలం ఉన్నా ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు కాస్తంత దూరంగా ఉంటున్న వేదవ్యాస్ తిరిగి యాక్టివేట్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన వీరిద్దరూ టీడీపీలో చేరితే కృష్ణా జిల్లా టీడీపీకి మరింత బలమొస్తుందని అంటున్నారు. అదే సమయంలో దేవినేని చేరికతో పార్టీలో అంతర్గత కలహాలు కూడా పెరుగుతాయని భయపడుతున్నారు.