Begin typing your search above and press return to search.

'జ‌గ‌న్‌ - కేసీఆర్‌' దేవినేని లాజిక్ మిస్ ?

By:  Tupaki Desk   |   24 Sep 2017 7:22 AM GMT
జ‌గ‌న్‌ - కేసీఆర్‌  దేవినేని లాజిక్ మిస్ ?
X
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేసే ఏ సంద‌ర్భాన్ని అధికార తెలుగుదేశం పార్టీ వ‌దిలిపెట్టుకోద‌నే విష‌యాన్ని...ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సంద‌ర్భం క‌లిసి రాక‌పోతే సృష్టించి అయినా...వైఎస్ జ‌గ‌న్‌ పై - వైసీపీపై టీడీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తుంటార‌ని జ‌గ‌న్ పార్టీ నేత‌లు అంటుంటారు. అయితే ఇదే రీతిలో తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జల వనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన విమ‌ర్శ లాజిక్‌ కు దొర‌క‌డం లేద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. అంతేకాదు...టీడీపీ నేత‌లు న‌వ్వుల పాల‌య్యే రీతిలో ఉంద‌నేది వారి వాద‌న‌.

ఇంత‌కీ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఏం మాట్లాడారంటే...రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటిని తోడేస్తోందని పక్క రాష్ట్రాన్ని వైసీపీ రెచ్చగొడుతోందని ఆరోపించారు. రాయలసీమలో నెలకొన్న దాహార్తిని తీర్చేందుకు శ్రీశైలం నీటిని వాడుతుంటే ఆ పార్టీ అడ్డు తగులుతోందని మంత్రి అన్నారు. రాయలసీమకు నీరందిస్తుంటే ఒక పక్క అడ్డు కునే ప్రయత్నం చేస్తూ మరో పక్క సీమకు నీరు ఇవ్వడం లేదని ధర్నా చేయడానికి పూనుకున్నారంటూ ఉమా మండిప‌డ్డారు. విదేశాల నుంచి వచ్చాక జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో ఏదో ఒక అలజడిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పట్టిసీమ దండగని పదేపదే చెప్పిన జగన్‌ ఇప్పుడు అక్కడ నుంచి వస్తున్న నీటిని చూసి రైతులకు క్షమాపణలు చెప్పాలని ఉమ డిమాండ్ చేశారు.

మంత్రి దేవినేని ఉమ విమ‌ర్శ‌ల్లో కీల‌క అంశం తెలంగాణ‌ను నీళ్ల విష‌యంలో వైఎస్ జ‌గ‌న్ రెచ్చ‌గొట్ట‌డం. మంత్రిగా ఉన్న ఉమ ఇంత సిల్లీ పాయింట్‌ ను ఎలా కామెంట్ చేశార‌ని అంటున్నారు. తెలంగాణ ఉద్య‌మం ట్యాగ్‌ లైనే...నీళ్లు - నిధులు - నియామ‌కాలు. కాబ‌ట్టి ఎంత శ్ర‌ద్ధ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు అయితే....ఆ రాష్ట్రంలోని ప్ర‌తి రిజ‌ర్వాయర్ గురించి స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉంది. అసెంబ్లీ సాక్షిగా ఆయ‌న ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌నే ఇందుకు నిద‌ర్శ‌నం. ఇంకా విశ్లేషిస్తే...గులాబీ ద‌ళ‌ప‌తి - ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడైన తెలంగాణ నీటిపారుద‌ల శాఖ మంత్రి హ‌రీశ్‌ రావు త‌న శాఖ విష‌యంలో నిత్యం అల‌ర్ట్‌ గా ఉంటారు. ఇలా తెలంగాణ స‌ర్కారులోని ప్ర‌తి విభాగం అల‌ర్ట్‌ గా ఉండి త‌మ వాద‌న‌ను వినిపిస్తే....ఏపీ స‌ర్కారును ప్ర‌శ్నిస్తే....దాన్ని జ‌గ‌న్‌ కు అంట‌గ‌ట్ట‌డం టీడీపీకే చెల్లింద‌ని అంటున్నారు.