Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యే - టీడీపీ లీడర్ పంచాయితీ ఫిర్యాదుల వరకు వెళ్ళింది!
By: Tupaki Desk | 11 Sep 2020 4:00 PM GMTఏపీ ఫైర్ బ్రాండ్స్ మధ్య నిప్పులు కురుస్తున్నాయి. మంత్రి కొడాలి నాని, టీడీపీ నేత దేవినేని ఉమల మధ్య వైరం ముదిరింది. మంత్రి నానిపై తాజాగా దేవినేని ఉమ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. మంత్రితో సహా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్, వల్లభనేని వంశీపై ఉమా ఈ ఫిర్యాదు చేశారు. తనను లారీతో తొక్కించి చంపుతామని వారు బెదిరించినట్టు ఉమ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రోత్సాహంతోనే తనను బెదిరిస్తున్నారని ఉమ ఆరోపించారు.
మంత్రిగా బాధ్యతల గల పదవిలో ఉండి లారీతో తొక్కిస్తానని బెదిరిస్తున్నాడని నానిపై ఉమ ఫైర్ అయ్యారు. నానిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అధికార వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై ప్రశ్నిస్తే తనకు రోజుకు 10 సార్లు బెదిరింపు కాల్స్ చేసి చంపేస్తామంటున్నారని టీడీపీ నేత ఉమ ఆరోపించారు.
ఇక ఇదే వ్యవహారంపై టీడీపీ మరో నేత బచ్చుల అర్జునుడు మాట్లాడారు.కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని అన్నారు. ప్రశ్నించేవారిని బెదిరిస్తారా అంటూ మండిపడ్డారు.