Begin typing your search above and press return to search.
జగన్ కు రివర్స్ పంచ్ ఇచ్చిన దేవినేని
By: Tupaki Desk | 23 Sep 2016 1:38 PM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సరదాగానే కాదు సీరియస్ గా కూడా చేసే విమర్శ....బాబు వస్తే కరువు ఉంటుంది. అయితే ఇపుడు అదే కామెంట్ ఆధారంగా ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రతిపక్ష వైసీపీపై విమర్శలు చేశారు. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడి వెళ్లిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉంటే వర్షాలు పడవు - కరువు వస్తుంది అంటూ విమర్శలు చేసిన వారు ఇపుడేం మాట్లాడతారంటూ నిలదీశారు. అలా చేసిన వైసీపీ నాయకులు చేసిన చెత్త ప్రచారం ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదలో కొట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో నీటి కరువు ఎదురైతే ధర్నా చేద్దామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రయత్నం చేశారని అయితే పుష్కలంగా వర్షాలు కురవడంతో ఆయన ఆశలు అడియాసలయ్యాయని దేవినేని ఉమా పేర్కొన్నారు. ఏపీ - తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకళ సంతరించకున్నాయని చెప్పారు. గుంటూరు - నల్గొండ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు - వంకలు పొంగి పోర్లి పులిచింతల ప్రాజెక్టులో 40 టీఎంసీల నీరు నిలిచిందని చెప్పారు. పెద్ద ఎత్తున వస్తున్న నీళ్లను సద్వినియోగం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు దేవినేని చెప్పారు. ప్రకాశం బ్యారేజీ-పులిచింతల మధ్యలో ఇంకో బ్యారేజీని నిర్మాణం చేయాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు. గోదావరి నుంచి రెండు వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తోందని చెప్పిన దేవినేని రాబోయే రోజుల్లో గోదావారి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి పూర్తిస్థాయిలో నీళ్లు వస్తుండటంతో పట్టిసీమకు నీటిని విడుదల చేయడం ఆపేసినట్లు తెలిపారు.