Begin typing your search above and press return to search.
దేవినేని ఉమ..అందుకే అచ్చెన్న తరఫున గళం విప్పాడా?
By: Tupaki Desk | 22 Feb 2020 7:59 AM GMTఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడి పేరు మార్మోగిపోతూ ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతల పేర్లు అవినీతి వ్యవహారాల్లో మార్మోగుతున్నాయి. టీడీపీ అధినేత - మాజీ సీఎం చంద్రబాబు నాయుడి మాజీ పీఎస్ ఇంటిపై జరిగిన ఐటీ రైడ్స్ తో వ్యవహారం కాక మీదకు వచ్చింది. ఆ వ్యవహారంపై ఈడీ రంగ ప్రవేశం చేస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. చంద్రబాబు మాజీ పీఎస్ వద్ద ఏం దొరకలేదని వాదించి తెలుగుదేశం పార్టీ అడ్డంగా దొరికిపోయింది. ఐటీ పంచనామాలో కేవలం ఒక్క పేపర్ ను మాత్రమే టీడీపీ చూపించిన వైనంతో ఆ పార్టీ కామ్ అయిపోయింది. పూర్తి డిఫెన్స్ లోకి పడిపోయి కామ్ అయ్యింది టీడీపీ. ఇంతలోనే ఈఎస్ ఐ స్కామ్ వెలుగులోకి రావడం మరో సంచలనంగా మారింది.
తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ని తగులుకుంటున్న అచ్చెన్న పేరు ఈ స్కామ్ లో వినిపిస్తూ ఉంది. ఇక తన విషయంలో అచ్చెన్న తన వివరణ ఇచ్చుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున కూడా అచ్చెన్న కోసం ఎవరైనా గొంతు విప్పాలి. మిగతా వాళ్లు ఎవరూ అంతగా స్పందించలేదు. చంద్రబాబు నుంచి ఆదేశాలు వెళ్లలేదో - స్క్రిప్ట్ లు ఇంకా అందలేదో కానీ.. అచ్చెన్న తరఫున ఎవరూ అంతగా మాట్లాడటం లేదు. కేవలం మరో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం స్పందించారు. అచ్చెన్నాయుడు తరఫున ఈయన వకాల్తా పుచ్చుకున్నారు. ఆయనను వెనకేసుకు వచ్చారు. జగన్ ను విమర్శించారు. అచ్చెన్న బీసీ కాబట్టే ఆయనపై ఇలాంటి ఆరోపణలు అన్నారు. ఇలా ఎన్ని రకాలుగా అచ్చెన్నాయుడును వెనకేసుకు రావాలో అన్ని రకాలుగానే దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో ఒక ఆసక్తిదాయకమైన గాసిప్ వినిపిస్తూ ఉంది. దేవినేని ఉమ ఇలా స్పందించడం వెనుక వేరే లెక్క ఉందని, తెలుగుదేశం నాటి అక్రమాలపై జగన్ ప్రభుత్వం దృష్టిపెట్టిన నేపథ్యంలో అచ్చెన్నాయుడు దొరికారని, ఆ తర్వాతి టార్గెట్ దేవినేని ఉమ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలే దేవినేని నిర్వహించింది ఇరిగేషన్ శాఖ. ఈ నేపథ్యంలో దాంట్లో ఆరోపణలకు కొదవ ఉండదు. ఈ క్రమంలో దేవినేని ఉమ మంత్రిగా ఉన్న సమయంలో కమిషన్ల వ్యవహారంపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టిందనే వార్తలూ వస్తున్నాయి. అచ్చెన్నాయుడు తర్వాత దేవినేని ఉమ అనే టాక్ వస్తోంది. అందుకే ఆయన ముందుగా స్పందించారని, అచ్చెన్నాయుడుకు మద్దతుగా గళం విప్పారని.. రేపు తనను ఇరికిస్తారనే లెక్కలతో ఉమ ఆ స్థాయిలో రియాక్ట్ అయ్యాడనే ప్రచారం ఆఫ్ ద రికార్డుగా నడుస్తోంది!