Begin typing your search above and press return to search.
బాబు మనసు తెలుసుకోలేవా ఉమా?
By: Tupaki Desk | 4 Jun 2016 2:39 PM GMTనవనిర్మాణ దీక్ష సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ఇవ్వడం ద్వారానే సరైన న్యాయం జరుగుతుందనే అభిప్రాయాన్ని ఆయన స్పష్టంగా వెల్లడించారు. ఈ విషయం ప్రతిపక్షాలకు అర్థమై గగ్గోలు పెట్టినప్పటికీ అధికారపక్ష నేతలకు మాత్రం ఇంకా పూర్తిగా అర్థం కాలేదనే భావన వ్యక్తమవుతోంది.
నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో అశాస్త్రీయ విభజన - రాష్ట్ర ప్రగతిపై దాని ప్రభావం అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి చర్చను ప్రారంభించిన సందర్భంగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఏపీని అడ్డగోలుగా విభజించి తెలుగు వారికి తీరని అన్యాయం చేశారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ ప్రయత్నం కొనసాగుతోందని, ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఉమా తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా స్ఫూర్తి నింపడానికి నవ నిర్మాణ దీక్షను చోదకశక్తిగా సీఎం చంద్రబాబు ఎంచుకున్నారని వివరించారు.
శాసనమండలి సభ్యుడు రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి - మరింత స్ఫూర్తితో నవ నిర్మాణంలో భాగస్వాములయ్యేలా ప్రజలను - ఇతర సిబ్బందిని సమాయత్తం చేయడానికి దీక్షలు చేపట్టామని చెప్పారు. జిల్లా కలెక్టరు బాబు.ఎ మాట్లాడుతూ కేరళ నుంచి వచ్చిన తనను సైతం రాష్ట్ర విభజన దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇక్కడ స్థానికులకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం న్యాయం చేయకుంటే రాష్ట్ర విభజనకు పాల్పడిన వారికి పట్టిన గతే ఇప్పటి కేంద్ర పాలకులకూ పడుతుందని వారు హెచ్చరించారు.