Begin typing your search above and press return to search.
హరీశ్ కంప్లైంట్ మీద దేవినేని ఉమ ఎటాక్
By: Tupaki Desk | 7 Jun 2016 6:52 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న నీళ్ల పంచాయితీలో మరో పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం ఏర్పాటు అయిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తన పరిధి దాటి ప్రవర్తిస్తుందని తెలంగాణ రాష్ట్ర సర్కారు.. అలాంటిదేమీ లేదంటూ ఏపీ సర్కారు వాదులాడుకోవటం తెలిసిందే. కృష్ణా బోర్డు తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తన పార్టీ నేతలతో కలిసి కేంద్రమంత్రి ఉమాభారతిని కలిసి భేటీ అయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయం అంటూ తన వాదనను వినిపించారు.
రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 85(బీ).. సెక్షన్ 87(1) ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య జరిగిన నీటి పంపిణీని నియంత్రించడమనే కృష్ణా బోర్డు బాధ్యత అని.. పంపిణీ అధికారం లేని కృష్ణా బోర్డు అందుకు విరుద్ధంగా ముసాయిదా నోటిఫికేషన్ రూపొందిస్తుందంటూ హరీశ్ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు.
హరీశ్ కంప్లైంట్ మీద తాజాగా ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ రియాక్ట్ అయ్యారు. హరీశ్ చేసిన ఆరోపణల్ని ఆయన కొట్టివేశారు. తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులు జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. కేటాయింపుల్లో కృష్ణా నదీ బోర్డు జాగ్రత్తలు తీసుకునేలా సంతకాలు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టిందని.. విభజన చట్టం ప్రకారం తాము అడుగుతున్న ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పటం లేదని ఆరోపించారు. ఇలా.. ఒకరికి ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్న ఈ వ్యవహారం ఎక్కడి వరకూ వెళుతుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పాలి.